వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పెయిన్: మరోసారి ఉగ్రదాడికి యత్నం, నలుగురి కాల్చివేత

|
Google Oneindia TeluguNews

బార్సిలోనా: స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఉగ్రదాడి లాగానే కామ్‌బ్రిల్స్‌లోనూ పునరావృతం చేయాలన్న ఉగ్రవాదుల యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఈ దాడుల సూత్రధారులను పట్టుకొనేందుకు ఆ దేశ పోలీసులు భారీ ఆపరేషన్‌ చేపట్టారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో అత్యంత సమన్వయంతో దాడులు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పోర్ట్‌ఆఫ్‌ కామ్‌బ్రిల్స్‌లో రెండో ఉగ్రదాడిని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. కొందరు వ్యక్తులు ఒక వ్యానును విచక్షణా రహితంగా ప్రజలపైకి తీసుకెళ్లారు.

బార్సీలోనాలో తీవ్రవాద దాడి, 13మంది మృతిబార్సీలోనాలో తీవ్రవాద దాడి, 13మంది మృతి

Barcelona terror: Second attack foiled by police, 6 injured

ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. బార్సిలోనా ఘటనను పునరావృతం చేయటమే లక్ష్యంగా ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. వారిని ఆగిపోవాలని పోలీసులు హెచ్చరించిన ఫలితం లేకపోవడంతో భద్రతా దళాలు వారిని కాల్చి చంపాయి.

ఈ ఘటనలో నలుగురు హతమయ్యారు. గురువారం ఉగ్రదాడి జరిగిన బార్సిలోనాకు దక్షిణాన 130 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఉగ్రదాడిలో 13మంది ప్రాణాలు కోల్పోయారు.

English summary
Six civilians and one police personnel has been injured in a second attack in Spain, the Catalan government has said. The second attack at Cambrils hours after Las Ramlas was struck was however foiled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X