Imran Khan : ఇమ్రాన్ ఖాన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట- విడుదలకు ఆదేశాలు..

పాకిస్తాన్ లో అవినీతి ఆరోపణలతో సైన్యం అరెస్టు చేసిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఇవాళ భారీ ఊరట లభించింది. మూడు రోజుల క్రితం అల్ ఖదీర్ ట్రస్ట్ అక్రమాల వ్యవహారంలో ఇమ్రాన్ ను అరెస్టు చేసిన సైన్యం.. కోర్టులో హాజరుపర్చడంతో రిమాండ్ విధించింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. అయితే ఇవాళ ఉన్నట్లుండి పాకిస్తాన్ సుప్రీంకోర్టు.. ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది.

పాకిస్తాన్ సుప్రీంకోర్టు విడుదలకు ఆదేశాలు ఇవ్వడంతో ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇస్లామాబాద్ జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేశారు. దీంతో ఆయన లాహార్ కు పయనం అయ్యారు. అల్ ఖదీర్ ట్రస్ట్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ హైకోర్టులో విచారణకు హాజరైన క్రమంలో ఆయన్ను హఠాత్తుగా సైన్యం అదుపులోకి తీసుకుంది. దీంతో ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు.

imran-khan

పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న సమయంలో అల్ ఖదీర్ ట్రస్టు వ్యవహారంతో పాటు తనకు అధికార హోదాలో లభించిన బహుమతుల్ని కూడా అమ్మకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రస్తుత షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆయన్ను గద్దె దించింది. ఆ తర్వాత ఆయనపై దేశవ్యాప్తంగా 140 కేసుల వరకూ పెట్టింది. వీటిలో విచారణ ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ను సైన్యం అరెస్టు చేయడంతో దేశంలో నిరసనలు చెలరేగాయి. ఇమ్రాన్ పార్టీ పీటీఐ నేతలు రెచ్చిపోయారు. దీంతో భారీగా ఆస్తి, ప్రాణనష్టం కూడా తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఇమ్రాన్ ఖాన్ విడుదలకు ఆదేశించిన సుప్రీంకోర్టు.. ఆయన్ను మాత్రం హైకోర్టులో విచారణకు మాత్రం తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యేందుకు అంగీకరించారు. అటు ఇమ్రాన్ విడుదల నేపథ్యంలో ఆయన మద్దతుదారులు కూడా శాంతించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+