• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీరు మొసళ్ళుగా మారినా అది మీ ప్రాబ్లమ్: వ్యాక్సిన్లపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో షాకింగ్ కామెంట్స్

|

కరోనావైరస్ వ్యాక్సిన్లపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో షాకింగ్ కామెంట్స్ చేశారు. కరోనా వ్యాక్సిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన కరోనా వైరస్ తీవ్రత ను చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఒకవైపు బ్రిటన్ , యుఎస్ లలో ప్రజలు ఫైజర్ కంపెనీ కి సంబంధించిన కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఆయన మాత్రం వ్యాక్సిన్ పనితీరు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వ్యాక్సిన్ తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలకు మేము బాధ్యత వహించం : బోల్సోనారో

వ్యాక్సిన్ తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలకు మేము బాధ్యత వహించం : బోల్సోనారో

ఫైజర్-బయోఎంటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలకు మేము బాధ్యత వహించము అని పేర్కొన్న ఆయన వ్యాక్సిన్ ప్రభావంతో మీరు మొసళ్ళు గా మారినా, మహిళలకు గడ్డాలు వచ్చినా అది మీ సమస్య అంటూ పేర్కొన్నారు. అంతేకాదు మీరు సూపర్ హ్యూమన్ గా మారినా, పురుషుల గొంతు మారినా తమకు సంబంధం లేదంటూ బోల్సోనారో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రెజిల్ దేశంలో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ప్రజలందరికీ ఉచితంగా అందజేస్తామని, అయితే వ్యాక్సిన్ అందరికీ తప్పని సరి కాదని వెల్లడించారు.

కరోనాను మొదటి నుండి లైట్ తీసుకున్న బోల్సోనారో

కరోనాను మొదటి నుండి లైట్ తీసుకున్న బోల్సోనారో

బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చిన తర్వాత అందరికీ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. తనకు ఇప్పటికే కరోనా వైరస్ సోకి నయం అయిన కారణంగా తాను వ్యాక్సిన్ వేయించుకోనని చెప్పడం గమనార్హం. ఇక ఇమ్యునైజేషన్ కార్యక్రమం ప్రారంభించిన ఆయన కరోనా కారణంగా ముక్కు , నోరు వంటి శరీర భాగాలను తాకకూడదని వైద్య నిపుణులు చెబుతున్నా పదే పదే ముక్కును తాకుతూ కనిపించారు. మొదటి నుండి కరోనా వైరస్ ను సీరియస్ గా తీసుకోని బోల్సోనారో పెద్దగా కరోనా నిబంధనలను పాటించిన దాఖలాలు కూడా కనిపించలేదు .

తాను వ్యాక్సిన్ చేయించుకోనని వెల్లడించిన బ్రెజిల్ అధ్యక్షుడు

తాను వ్యాక్సిన్ చేయించుకోనని వెల్లడించిన బ్రెజిల్ అధ్యక్షుడు

వ్యాక్సిన్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, అయినప్పటికీ ప్రజలపై "బలవంతం" చేయలేమని ఆయన పేర్కొన్నారు. 212 మిలియన్ల జనాభాలో బ్రెజిల్ 7.1 మిలియన్లకు పైగా కేసులు , దాదాపు 1, 85,000 మరణాలను నమోదు చేసింది. బోల్సోనారో ఒక టీకా బ్రెజిల్ యొక్క రెగ్యులేటరీ ఏజెన్సీ చేత ధృవీకరించబడిన తర్వాత, "ఇది కోరుకునే ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది. కానీ నాకు, నేను టీకాలు వేయించుకోను " అంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

తనకు యాంటీ బాడీస్ ఉన్నాయి.. వ్యాక్సిన్ అవసరం లేదన్న బోల్సోనారో

తనకు యాంటీ బాడీస్ ఉన్నాయి.. వ్యాక్సిన్ అవసరం లేదన్న బోల్సోనారో

నేను చెప్పింది తప్పని కొందరు అంటున్నారు. కానీ తాను అలాంటి వెధవలకు చెప్పేది ఒక్కటే అంటూ తనకు కరోనా పాజిటివ్ నమోదైందని, ప్రస్తుతం తన వద్ద యాంటీబాడీస్ ఉన్నాయి, కాబట్టి టీకా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బోల్సోనారో జూలైలో కరోనా వైరస్ బారిన పడ్డారు, కానీ మూడు వారాల్లో కోలుకున్నాడు.కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సెకండ్ వేవ్ ప్రస్తుతం బ్రెజిల్ లో ఉంది. జూన్ నుండి ఆగస్టు వరకు గరిష్ట స్థాయిలు తగ్గుముఖం పట్టాయి, కాని నవంబర్‌లో అది మారిపోయింది. గురువారం, బ్రెజిల్ సెప్టెంబర్ నుండి మొదటిసారిగా కోవిడ్ -19 నుండి రోజువారీ 1,000 మరణాలను అధిగమించింది. బ్రెజిల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆలస్యంగా మరియు అస్తవ్యస్తంగా ఉందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Brazilian President Jair Bolsonaro has launched an attack on coronavirus vaccines, even suggesting that the one developed by Pfizer-BioNTech could turn people into crocodiles or bearded ladies.we’re not responsible for any side effects. Bolsonaro said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X