• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చావునే చావు దెబ్బ కొట్టినవాడు : ఫిడెల్ హత్యకు అమెరికా 638 విఫలయత్నాలు

|

హవానా : సమూహాలను ప్రభావితం చేయగలిగినవారు.. సమ్మోహన శక్తిగా అవతరించి దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసినవారు.. దేహం నుంచి తప్పుకోవచ్చు గానీ.. ప్రపంచ చరిత్రలో వారి పునాదులు సుస్థిరం. అలుపెరుగని పోరాటంతో అగ్రరాజ్యం కుయుక్తులను కాలదన్ని క్యూబాను స్వతంత్ర్య దేశంగా నిలబెట్టడంలో విప్లవ శిఖరం ఫిడేల్ కాస్ట్రో పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

1959 నుంచి 1976వరకు క్యూబా ప్రధానిగా.. 1976నుంచి 2008వరకు క్యూబా అధ్యక్షుడిగా.. ఆయన చేపట్టిన ఎన్నో సంస్కరణలు క్యూబాను స్వతంత్ర శక్తిగా నిలబెట్టడంలో దోహదం చేశాయి. సంపద పంపిణీలో సమానత్వం, సామాజిక న్యాయాన్ని అమలుచేయడంలో ఫిడెల్ అనుసరించిన పంథా క్యూబాను సోషలిస్టు ప్రతీకగా నిలిపింది.

అదే సమయంలో.. ఫిడెల్ ను అంతమొందించడానికి అమెరికా చేయని ప్రయత్నం లేదు. ఫిడెల్ ను చంపడానికి అమెరికా వేసిన ఎత్తుగడలన్ని చిత్తయిపోయాయి. ఏకంగా 630సార్లు ఆయనపై అమెరికా హత్యాయత్నానికి ప్రయత్నించిందంటే.. ఆయన జీవితం ఎంత సంక్లిష్టంగా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.

Castro Survived 638 Assassination Bids, Here Are Nine Ways CIA Thought He Could Be Killed

అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ఫిడెల్ పై జరిగిన హత్యాయత్నాల్లో మచ్చుకు కొన్ని :

* క్యూబా ప్రజల్లో ఫిడెల్ అంతగా ఆదరణ పొందడానికి కారణం.. ఆయన గడ్డం కూడా ఓ కారణమేనని సీఐఏ బలంగా విశ్వసించేది. ఈ క్రమంలోనే ఆయన గడ్డాన్ని తొలగించడానికి కూడా అమెరికా విఫలయత్నాలు చేసింది. థాలియం లవణంతో కూడిన ఓ పౌడర్ ను అమెరికా ఫిడెల్ పై ప్రయోగించింది. దీని ప్రభావానికి లోనైతే.. మనిషి తన శరీరంపై ఉన్న వెంట్రుకలను పూర్తిగా కోల్పోయి.. విక్రుతంగా తయారయ్యే అవకాశముంది.

1975లో సెనేట్ ఇంటిలిజెన్స్ కమిటీ రిపోర్టు ద్వారా ఈ విషయం వెల్లడవగా.. ఆ ప్రమాదం నుంచి ఫిడెల్ తప్పించుకోగలిగారు.

* ఆఖరికి ఫిడెల్ మాజీ భార్య మారిటా లారెంజ్‌ ద్వారా కూడా ఆయన్ను చంపేందుకు సీఐఏ ప్రయత్నించింది. విషపు మందుబిళ్లలతో ఫిడెల్ ను అంతమొందించడానికి లారెంజ్ తో ఒప్పందం కుదుర్చుకుంది సీఐఏ. అయితే అప్పటికే విషయాన్ని పసిగట్టిన ఫిడెల్ కాస్ట్రో.. లారెంజ్ పై గన్ను ఎక్కుపెట్టి నిలదీయడంతో.. నిజం ఒప్పేసుకుంది.

అయితే ఇదంతా సీఐఏ కుట్ర అని, తన ప్రయత్నం కాదని లారెంజ్ వేడుకోవడంతో.. ఆమెను ప్రాణాలతో వదిలిపెట్టారు ఫిడెల్.

అమెరికాను గడగడలాడించిన ఫిడెల్ కాస్ట్రో కన్నుమూత

* పెన్నులాంటి ఓ ఇంజక్షన్ తో ఫిడెల్ శరీరంలోకి విష ప్రయోగం చేసింది సీఐఏ. అయితే దీన్నుంచి కూడా ఫిడెల్ విజయవంతంగా బయటపడ్డారు.

* ఇక సిగరెట్ బాంబును సైతం ఆయనపై ప్రయోగించింది సీఐఏ. 1960లో కాస్ట్రో ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్లిన సందర్భంగా ఈ బాంబు ప్రయోగం చేసింది. ఓ పోలీస్ ఆఫీసర్ పేలుడు పదార్థాలతో నింపిన సిగరెట్ ను ఫిడెల్ కు ఆఫర్ చేశాడు. అయితే అప్పటికే విషయాన్ని పసిగట్టిన ఫిడెల్ ఆ సిగరెట్ ను నిర్వీర్యం చేశారు.

* ఫిడెల్ కాస్ట్రో అమితంగా ఇష్టపడే స్కూబా డైవ్ సూట్ లోను పేలుడు పదార్థాలతో, అత్యంత ప్రమాదకర ఫంగస్ బ్యాక్టీరియాతో ఆయన్ను చంపేందుకు సీఐఏ ప్రయత్నించింది. అయినా ఫిడెల్ ముందు అవన్ని విఫలయత్నాలుగానే మిగిలిపోయాయి.

*ఫిడెల్ ప్రసంగించే రేడియో స్టేషన్ ను సైతం పేల్చేందుకు ప్రయత్నించింది సీఐఏ. ఇందుకోసం ఎల్ఎస్‌డీతో కూడిన పౌడర్ స్ప్రేను ఉపయోగించింది. అయితే ఇది కూడా విఫలయత్నంగా మిగిలపోక తప్పలేదు.

* హ్యాండ్ కర్చీఫ్ లో ప్రమాదకర బ్యాక్టీరియాను నింపి ఓసారి.. పాలల్లో విషం కలిపి మరోసారి ఫిడెల్ ను చంపడానికి సీఐఏ యత్నించినా.. అవేవి ఆయన ప్రస్థానానికి అడ్డుకాలేకపోయాయి. మొత్తం మీద చావునే చావుదెబ్బ కొట్టి.. వందలసార్లు.. మృత్యు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు ఫిడెల్.

English summary
Cuban revolutionary leader Fidel Castro died today. America's Central Intelligence Agency (CIA) was involved in numerous failed attempts to eliminate him for most part of his life, particularly during the 1960s and 70s. Every time, Castro deceived his death only to humiliate his main adversary, the USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X