సముద్ర జలాల కదలికలపై చైనా సరికొత్త నిఘా, ఐనా ఆమెరికాకు దూరమే

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: సముద్రం లోపల ఇతర దేశాలకు చెందిన జలంతర్గాములు, క్షిపణి వ్యవస్థలను కనిపెట్టేందుకు చైనా సరికొత్త నిగా వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనిని హిందూ మహాసముద్రంతో పాటు మారిటైమ్ సిల్క్ రోడ్డులో ఏర్పాటు చేస్తోంది.

దీనిని సముద్రం లోపల కదలికలు, నీటి సాంధ్రత, సముద్ర నీటి ఉష్ణోగ్రత, సముద్ర జీవుల సమాచార సేకరణ తదితర పనులు చేయడంతో పాటు వివిధ దేశాలకు చెందిన జలాంతర్గాముల రాకపోకలపై కన్నేసి ఉంచుంది.

అందుకే కొత్త నిఘ వ్యవస్థ

అందుకే కొత్త నిఘ వ్యవస్థ

ఇప్పటికే ఈ కొత్త వ్యవస్థ పని చేయడం ప్రారంభించిందని హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. అంతర్జాతీయ జలాల్లో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేయాలనేది చైనా ఆలోచనగా భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని చైనా అకాడమీ ఆఫ్ సెన్సెస్ పర్యవేక్షణలో సౌత్ చైనా సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియనాలజీ నిఘా వ్యవస్థను రూపొందించింది.

అక్కడ సమాచార విశ్లేషణ

అక్కడ సమాచార విశ్లేషణ

దక్షిణ చైనా సముద్రం, పశ్చిమ పసిఫిక్ మహా సముద్రం, హిందు మహా సముద్రాల్లో ఈ నిఘా వ్యవస్థను అమలులోకి తీసుకు వచ్చింది. ఇలా సేకరించిన సమాచారం దక్షిణ చైనా సముద్రంలోని పారిస్ల్ దీవుల్లో, దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాగ్, దక్షిణ ఆసియాలో నెలకొల్పిన మూడు సమాచార సేకరణ కేంద్రాలకు చేరుకుంటుంది. అక్కడ సమాచారాన్ని విశ్లేషిస్తారు.

చైనా ఆలోచనలు

చైనా ఆలోచనలు

పైరేట్స్ సమస్యను అధిగమించేందుకు కూడా ఈ నిఘాను అదికం చేస్తుంది. గస్తీ పడవలను తిప్పటంతో పాటు జలాంతర్గాములను ఎంపిక చేసిన ప్రదేశాల్లో సిద్ధంగా ఉంచింది. హిందూ మహా సముద్రంలో సరకు రవాణా పోర్టులను నెలకొల్పే ఆలోచనలతోను చైనా ఉంది. గత ఏడాది శ్రీలంక నుంచి హంబన్ తోట నౌకాశ్రయాన్ని 99 ఏళ్లకు అద్దెకు తీసుకుంది.

చైనా ఎంతగా ప్రయత్నాలు చేసినా

చైనా ఎంతగా ప్రయత్నాలు చేసినా

అంతర్జాతీయ పెత్తనం కోసం చైనా ఎంతగా ప్రయత్నాలు చేసినా.. అమెరికా అధిపత్యాన్ని సవాల్ చేయడం సాధ్యం కాదని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు ఉన్న సముద్ర నిఘా వ్యవస్థ, యంత్రాంగంతో పోల్చితే చైనా చాలా దూరంలో ఉంటుందని అంటున్నారు. అయితే దీర్ఘకాలానికి ఈ అడుగులు వేస్తున్నట్లుగా చైనా నిపుణులు చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
China has developed a new underwater surveillance network to help its submarines get a stronger lock on targets while protecting the nation’s interests along the maritime Silk Road, which included the Indian Ocean, a media report said today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి