చైనా రెచ్చగొడుతోంది, భారత్‌కు ఒబామాలానే ట్రంప్: యూఎస్ సభ్యుడు రాజాకృష్ణమూర్తి

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: డోక్లామ్‌ వివాదంపై చైనా వైఖరి రెచ్చగొట్టే విధంగా ఉందని అమెరికా కాంగ్రెస్‌ చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆరోపించారు. డొక్లామ్‌ పీఠభూమి వివాదంపై ఏం జరుగుతుందా? అని ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుత వివాదంపై చైనా రెచ్చగొట్టే చేష్టలు చేస్తుందని అనుకుంటున్నానని కృష్ణమూర్తి చెప్పారు.

'ఇరు దేశాలు ద్వైపాక్షిక శాంతియుతమైన చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తాను. అది జరిగాలని ఆశిస్తాను. ఏ దేశం కూడా రెచ్చగొట్టే విధంగా చర్యలు తీసుకోకూడదు. సరిహద్దు వివాదాల విషయంలో అది చాలా కీలకం' అని కృష్ణమూర్తి స్పష్టం చేశారు.

China has taken provocative steps in Doklam: US lawmaker

కాగా, భారత్‌-చైనా మధ్య నెలకొన్న డొక్లామ్‌ ప్రతిష్టంభన విషయంపై యూఎస్‌ ఇప్పటి వరకు ఏమీ మాట్లాడకుండా మౌనం పాటిస్తూ వస్తోంది. ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. అయితే, రాజా కృష్ణమూర్తి ఈ అంశంపై నేరుగా స్పందించారు. బరాక్ ఒబామాలాగే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్‌కు మద్దతుగా ఉంటారని రాజా తెలిపారు.

అంతేగాక, 'ఈ వివాదాన్ని పరిశీలిస్తున్నాం. దీని గురించి భారత్‌, చైనా, భూటాన్‌ దేశాల నుంచి మరింత సమాచారాన్ని తీసుకుంటాం' అని స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. భారత్‌-భూటాన్‌-చైనా ట్రైజంక్షన్‌ వద్ద చైనా నిర్మిస్తున్న రహదారి పనులను భారత్‌ అడ్డుకోవడంతో ఈ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

Sikkim Standoff: India-China missile strength comparison | Oneindia News

ఈ నేపథ్యంలో చైనా, భారత్ బలగాలు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, భూటాన్‌కు చెందిన డోక్లాం సరిహద్దు ప్రాంతాన్ని తమది చెప్పుకున్న చైనాకు ఆ దేశం గట్టి షాకిచ్చింది. డోక్లాం తమ దేశ భూభాగమని భూటాన్ స్పష్టం చేసింది. దీంతో చైనా అబద్ధాల బాగోతం బయటపడింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Expressing concern over the Sikkim standoff between India and China, an influential US lawmaker has accused Beijing of taking provocative steps that have resulted in the escalation of tensions between the two Asian giants.
Please Wait while comments are loading...