అస్ట్రేలియాను ఎంచుకొంటున్న ఇండియా టెక్కీలు, కారణమిదే?

Posted By:
Subscribe to Oneindia Telugu

కాన్ బెర్రా: అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తీసుకొంటున్న నిర్ణయాలు వివాదాలకు కారణమౌతున్నాయి.అయితే తాజాగా ట్రంప్ తీసుకొన్న నిర్ణయంతో ఇండియాకు చెందిన టెక్కీలు అమెరికాకు బదులుగా అస్ట్రేలియాను ఎంచుకొంటున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానంగా సాఫ్ట్ వేర్ కంపెనీలను లక్ష్యంగా ఎంచుకొని నిర్ణయాలను తీసుకొన్నాడు.అయితే ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాల కారణంగా ప్రధానంగా ఇండియాకు చెందిన టెక్కీలకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి.

అయితే తాజాగా ట్రంప్ తీసుకువచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రభావం భారత్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలపై పడే అవకాశం ఉంది. దీంతో ఇండియాకు చెందిన టెక్కీలు స్వదేశానికి వచ్చే అవకాశాలున్నాయి.

మరో వైపు ఎన్నికల ప్రచారంలో స్థానికులకే ఉద్యోగవకాశాలను కల్పిస్తానని ట్రంప్ హమీ ఇచ్చారు.ఈ మేరకు తాజాగా బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తెచ్చాడు.ట్రంప్ నిర్ణయం కారణంగా అమెరికాను వదిలి అస్ట్రేలియా వైపు భారత్ టెక్కీలు చూస్తున్నారు.

అస్ట్రేలియా వైపు ఇండియా టెక్కీల చూపు

అస్ట్రేలియా వైపు ఇండియా టెక్కీల చూపు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి హెచ్ 1 బీ వీసాలపై నియంత్రణ, వలసలపై కఠిన వైఖరి అవలంభిస్తుండటంతో పలువురు భారతీయులు అస్ట్రేలియాపై దృష్టికేంద్రీకరించారు.

అయితే అస్ట్రేలియాలోనూ ఆ దేశ ప్రధాని టర్న్ బుల్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కఠినతరం చేయడంతో ఆ దేశంలో స్థిరపడాలని ఆశిస్తున్న ఇతర దేశస్తులకు పలు అడ్డంకులు ఎదురుకానున్నాయి.

 అస్ట్రేలియా పౌరసత్వం కోసం 4 ఏళ్ళు వేచిచూడాలి

అస్ట్రేలియా పౌరసత్వం కోసం 4 ఏళ్ళు వేచిచూడాలి

అస్ట్రేలియాలో పౌరసత్వం కోసం ధరఖాస్తు చేయాలనుకోనేవారు నాలుగేళ్ళు వేచి చూడాలి. ఇప్పటివరకు ఒక్క ఏడాది మాత్రం వేచి చూస్తే అస్ట్రేలియా పౌరసత్వం దక్కేది. అయితే దాన్ని నాలుగేళ్ళకు మార్చారు.ఆంగ్లబాషలో ప్రావీణ్యం ఉండాలి. అస్ట్రేలియా పౌరసత్వానికి సంబంధించిన అర్హత పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది.

 అస్ట్రేలియా దేశ విలువలను గౌరవించాలి

అస్ట్రేలియా దేశ విలువలను గౌరవించాలి

అస్ట్రేలియా పౌరసత్వం కోసం ధరఖాస్తు చేసుకొనే వారు ఆ దేశ విలువలను గౌరవించాల్సి ఉంటుంది సమాజంలో ఎలా మమేకం కానున్నారనే అంశాలను అధ్యయనం చేస్తామని ప్రధాని టర్న్ బుల్ ప్రకటించారు. అస్ట్రేలియాకు ఇతర దేశాల నుండి వచ్చేవారికి వీసాలను ఏటా లక్షవరకు మంజూరు చేస్తారు. అయితే యజమానులు ఈ వీసాలను దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు.

వలసలకు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు

వలసలకు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన టర్న్ బుల్ నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఐరోపా, అమెరికాలోలో వలసలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని సూర్తిగా తీసుకొందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.దీంతో పాటు దేశంలో పెరిగిపోతున్న ఆర్థికలోటు, తక్కువ వేతనాలు, నిరుద్యోగం తదితర సవాళ్ళు ప్రభుత్వం ముందున్నాయి. వీటి నుండి దృష్టిని మరల్చేందుకుగాను వలస చట్టాలను కఠినతరం చేసిందని విమర్శలు వస్తున్నాయి.ప్రతి ఏటా 210 దేశాల నుండి 1.30,000 అస్ట్రేలియా పౌరసత్వం కోసం ధరఖాస్తు చేసుకొంటారు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Immigration minister Peter Dutton has revealed more detail into the new citizenship test announced by the Turnbull government.To become citizens applicants will need to have been a permanent resident for four years - up from 12 months now - face a stand-alone English test and commit to embracing Australian values.
Please Wait while comments are loading...