వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాద దేశాల జాబితా నుంచి క్యూబా తొలగింపు: సరైన నిర్ణయమన్న మంత్రి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా రూపొందించిన ఉగ్రవాద ప్రేరేపిత దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగించింది. దీంతో ఉగ్రవాద ప్రేరేపతి దేశాల జాబితాలో ఇక సిరియా, ఇరాన్, సుడాన్‌లు మాత్రమే మిగిలాయి. ఈ

ఈ నిర్ణయంపై క్యూబా హర్షం వ్యక్తం చేసింది. ఇది న్యాయమైన నిర్ణయమంటూ అమెరికాకు కృతజ్ఞతలు తెలిపింది.

క్యూబా ప్రభుత్వాన్ని ఉగ్రవాద ప్రేరేపిత దేశాల జాబితా నుంచి తొలగించడంపై ఆ దేశ విదేశాంగ మంత్రి జోసిఫినా వైడల్ స్పందించారు. ఈ నిర్ణయంపై "అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కృతజ్ఞతలు. టెర్రరిజం బారిన పడ్డ దేశాల్లో క్యూబా కూడా ఒకటి. గడచిన కొన్ని సంవత్సరాలుగా సుమారు 3,478 మంది ఈ ఉగ్రవాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు" అని అన్నారు.

1976లో బార్బడోస్ నుంచి క్యూబాకు వస్తున్న ప్యాసింజర్ విమానంపై కొంత మంది ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో 73 మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనలో క్యూబన్ బహిష్కృతుల ప్రమేయం ఉండటం వల్ల క్యూబాని ఉగ్రవాద ప్రేరేపిత దేశాల జాబితాలో చేర్చింది.

Cuba says removal from US terrorism list a ‘fair decision’

ఇప్పుడు తాజాగా క్యూబా నేతలు ఉగ్రవాద సంస్థలకు ఎటువంటి సహాయం చేయమని మాటిచ్చారని ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు. ఇక ఇటీవల జరిగిన పనామా సదస్సులో దౌత్య సంబందాల పునురుద్ధరణ, వాణిజ్యం, రాకపోకలపై ఇరుదేశాధినేతలు సానుకూల ప్రకటనలు చేసుకున్నారు.

క్యూబా రాజధాని హవానాలో అమెరికా రాయబార కార్యాలయం, వాషింగ్టన్‌లో క్యూబా కార్యాలయం ప్రారంభానికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ వాటిని అధిగమించి టూరిజం, వ్యవసాయం, బ్యాంకింగ్‌, వాణిజ్యరంగాల్లో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవడానికి ముందుకు వచ్చారు.

కోల్డ్‌వార్‌ పరిస్థితులని క్రమేపి తగ్గించుకుని వైరుధ్యం కంటే సహకారమే ముఖ్యమనే సూత్రంతో కలిసి మెలిసి సాగారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో కరచాలనం చేసుకుని నవ్వుతూ పలకరించుకోవడం అక్కడున్న పలువురిని ఆకర్షించింది. గత 60 సంవత్సరాలుగా ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి సత్సంబంధాలు లేని విషయం తెలిసిందే.

English summary
Cuba recognised what it called a “fair decision” by US president Barack Obama to inform Congress he intends to remove Cuba from a US list of state sponsors of terrorism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X