Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దెయ్యాలు, భూతాలను చూడాలంటే?: చదవండి(లైవ్)

న్యూఢిల్లీ: మనలో చాలా మంది దెయ్యాలు, భూతాలంటే భయం ఉంటుంది. మరికొంత మందికి హార్రర్ సినిమాలు చూసే అలవాటు ఉంటుంది. దెయ్యాలు, భూతాలంటే భయం లేని వారి కోసం వాటిని లైవ్ షో‌లో చూపించడానికి ఓ అమెరికన్ చానల్ ముందుకొచ్చింది.

డిస్కవరీ కమ్యూనికేషన్స్ నిర్వహిస్తున్న 'డెస్టినేషన్ అమెరికా' అనే చానల్ లో "ఎక్జార్సిమ్: లైవ్!" పేరిట దయ్యాలను తరమడం, భూతవైద్యాన్ని చేయడం లైవ్ టెలికాస్ట్ చేయనుంది. ఈ కార్యక్రమం శుక్రవారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 8 గంటలకు) ప్రసారం కానుంది.

రెండు గంటల పాటు ఈ లైవ్ షోను అందించనుంది. హాలీవుడ్ హారర్ సినిమా 'ద ఎక్సార్సిస్ట్' గురించి వినేఉంటారు. ఆ సినిమాకు అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో ఉన్న ఓ ఇంట్లో షూటింగ్ చేశారు. ఆ ఇంట్లో ఇంకా దయ్యాలు ఉన్నాయన్న వదంతలు వినిపిస్తుండటంతో ఆ ఇంటిలోని దెయ్యాలు, భూతాలను పారదోలేందుకు భూతవైద్యులు సిద్ధమయ్యారు.

Destination America Airs First-Ever Live Exorcism Tonight

ఈ భవనం ఎప్పుడూ చీకటిలోనే ఉంటుంది. ఈరోజు రాత్రికి ఆ ఇంట్లో ఉన్న దెయ్యాల్ని, భూతాల్ని తరిమేయనున్నారు. ఈ తతంగం మొత్తాన్ని ఐదు కెమెరాలతో షూట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రియాల్టీ షోలు చేసి టీవీ ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన జోడీ టోవాయ్ ఈ లైవ్ లో స్వయంగా పాల్గొంటారు.

"ఈ భవనం గురించిన ఎన్నో కథలు, మిస్టరీ చరిత్రలో దాగున్నాయి. అందుకే మా కార్యక్రమం వినూత్నమైనది" అని టోవాయ్ పేర్కొన్నారు. ఈ షోలో టోవాయ్ తో పాటు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఆ భవంతిలోకి అడుగు పెడతారు. డిస్కవరీ కమ్యూనికేషన్స్ సంస్థ దీన్ని నిర్మిస్తుంది. ఆ ఈవెంట్‌ను మాత్రం డెస్టినేషన్ అమెరికా.కామ్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

లైవ్ షో: దెయ్యాలు, భూతాలను చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+