ట్రంప్‌ను మళ్లీ గెంటేసిన ఫేస్‌బుక్‌- కోడలి అకౌంట్‌తో ఎంటర్‌- అయినా కనికరించని వైనం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు తన పదవి నుంచి తప్పుకున్న తర్వాత అవమానాలు తప్పడం లేదు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా వివాదాస్పద అంశాలు పోస్ట్‌ చేసి సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్ ఆగ్రహానికి గురైన ట్రంప్‌ ఆయా ప్లాట్‌ఫామ్స్‌పై తన ఖాతాల్ని కోల్పోయారు. ఇప్పుడు ఇతరుల ఖాతాల నుంచి వాటిలో దూరేందుకు చేసిన ప్రయత్నాన్ని ఫేస్‌బుక్‌ అడ్డుకుంది.

డొనాల్డ్‌ ట్రంప్‌ తన తాజా ఇంటర్వ్యూను తన కోడలు లారా ట్రంప్‌ ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్ట్ చేశారు. దీంతో వెంటనే ఆ విషయాన్ని గుర్తించిన ఫేస్‌బుక్ దాన్ని తొలగించడమే కాకుండా లారా ట్రంప్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది. మరోసారి ట్రంప్‌కు సంబంధించిన సమాచారం పోస్ట్‌ చేస్తే మీరు కూడా ఖాతా కోల్పోవాల్సి వస్తుందంటూ హెచ్చరించింది. దీంతో ట్రంప్‌ కుటుంబానికి ఇదో తీరని అవమానంగా మారింది. లారా ట్రంప్‌.. డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు ఎరిక్ ఫ్రెడ్‌రిక్ ట్రంప్‌ భార్య.

Donald Trump enters Facebook via daughter-in-laws page, thrown out again

ఈ ఏడాది జనవరి 6న క్యాపిటల్‌ హిల్‌ దాడి ఘటన తర్వాత ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ కూడా డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాలు నిలిపేయడంతో పాటు ఆయనకు సంబంధించి ఇతరులు చేసిన పోస్టులను కూడా తొలగించాయి. ఈ విషయం తెలిసి కూడా లారా ట్రంప్‌ ఖాతా నుంచి వీడియోను పోస్ట్‌ చేయడంతో ఫేస్‌బుక్‌ తమ నిర్ణయాన్ని మరోసారి గుర్తు చేసింది. అప్పట్లో క్యాపిటల్‌ హిల్ ఘటన తర్వాత 24 గంటల పాటు ట్రంప్‌ ఖాతా స్తంభింపజేసిన ఫేస్‌బుక్‌.. అనంతరం నిరవధిక నిషేధం విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+