పిచ్చెక్కిన ట్రంప్..? సుంకాల పెంపు అద్భుతమని ప్రశంస-దేశ, విదేశాల్లో గగ్గోలు..!
అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విదేశాలపై భారీ సుంకాలు విధించి వారిని దారికి తెచ్చుకోవాలని చూస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అయినా సుంకాల పెంపుపై వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటున్న ట్రంప్..ఇవాళ తన నిర్ణయాన్ని మరోసారి సమర్ధించుకున్నారు. సుంకాల పెంపు అద్బుతమైన విషయమంటూ ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు.
అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే విదేశాలపై భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు చేసిన ట్రంప్.. అన్నట్లుగానే దెబ్బకి దెబ్బ తీస్తున్నారు. దీంతో ట్రంప్ బాధిత దేశాల జాబితాలోకి భారత్, చైనా, కెనడా ఇలా పలు దేశాలు చేరిపోయాయి. ట్రంప్ విధిస్తున్న ప్రతీకాల సుంకాలతో ఆయా దేశాల్లో ఇప్పటికే సొంత ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ ట్రంప్ కు ఊడిగం చేసి ఇప్పుడు ఆయన్ను నియంత్రించలేకపోతున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు స్వదేశంలో సైతం ట్రంప్ సుంకాల దాహంపై జనం మండిపడుతున్నారు. ట్రంప్ తన అస్తవ్యస్త నిర్ణయాలతో దేశాన్ని నాశనం చేస్తున్నారంటూ ఏకంగా 1200 ప్రాంతాల్లో భారీగా నిరసనలు మొదలయ్యాయి. ఇందులో ఎన్నడూ లేని విధంగా ప్రజలు భారీగా పాల్గొంటున్నారు. ఇంకా చెప్పాలంటే అమెరికాలో ట్రంప్ విధానాల కారణంగా నష్టపోతున్న వారంతా ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. ఈ నిరసనలు మరింత తీవ్ర రూపం దాల్చితే పరిస్ధితి ఏంటన్నది ట్రంప్ సర్కార్ కు అంతుబట్టడం లేదు.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన సుంకాల పెంపు నిర్ణయాన్ని సమర్ధించుకుంటున్నారు. తన ప్రతీకార సుంకాల పెంపు నిర్ణయం అద్భుతమైన విషయమని, దాన్ని ఏదో ఒక రోజు అమెరికన్లు అర్ధం చేసుకుంటారని చెబుతున్నారు. చైనా, యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాల నుంచి భారీ ఎత్తున తమకు బకాయిలు ఉన్నాయని, వీటికి సుంకాల పెంపే పరిష్కారమని తెలిపారు. తమ నిర్ణయంతో ఆయా దేశాల నుంచి బిలియన్ల డాలర్లు వచ్చిపడుతున్నాయన్నారు.

అటు ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు భారీ నష్టాలతో కుదేలవుతున్నాయి. అమెరికాలో అయితే ఈ ఏడాదే ఆర్ధిక మాంద్యం తప్పేలా లేదన్న చర్చ జరుగుతోంది. అయినా ట్రంప్ మాత్రం వెనక్కితగ్గడం లేదు. ట్రంప్ నిర్ణయాల ప్రభావంతో భారత్ లోనూ మార్కెట్లు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. మార్కెట్లను కుదిపేస్తున్న సుంకాల పెంపు నిర్ణయంపై ట్రంప్ సర్కార్ మాత్రం దూకుడుగానే ముందుకు వెళ్తోంది.
-
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications