డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై దాడులు కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆశ్చర్యకరంగా యూటర్న్ తీసుకున్నారు. యుద్ధ విరామాన్ని ప్రకటించారు. యుద్ధభూమి నుంచి 'నిష్క్రమణ ప్రణాళిక'ను వెల్లడించారు. సైనిక లక్ష్యాలను పూర్తి చేయడానికి అతి సమీపంలో ఉన్నామని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న తన పెద్ద ఎత్తున సైనిక కార్యకలాపాలను క్రమంగా తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన సుదీర్ఘ కారణాలను ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు ట్రంప్. తమ విజయాలకు గీటురాయి అని భావిస్తున్న అనేక అంశాలను ఇందులో ప్రస్తావించారు. ఇరాన్ మిస్సైల్ సామర్థ్యాన్ని, రక్షణ, పారిశ్రామిక స్థావరాలను, నౌకాదళాన్ని, వైమానిక దళాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని స్పష్టం చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను దరి దాపులకు కూడా వెళ్లకుండా అమెరికా చూసుకుంటుందని కూడా హామీ ఇచ్చారు.

ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్ వంటి తమ ప్రాంతీయ మిత్రదేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ట్రంప్ పునరుద్ఘాటించారు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ భద్రత సంబంధించిన అంశం అత్యంత కీలకమైనదని, చమురు, వాణిజ్యం, ఎగుమతుల అవసరాల కోసం ఈ సముద్ర మార్గాన్ని ఉపయోగించే దేశాలే భద్రత, పర్యవేక్షణ బాధ్యతను తీసుకోవాలని ఆయన సూచించారు.
అవసరమైనప్పుడు అమెరికా సహాయం అందించగలుగుతుందని, అయినప్పటికీ- ప్రధాన బాధ్యత మాత్రం ఇతర దేశాలదేనని ట్రంప్ తేల్చి చెప్పారు. హార్ముజ్ జలసంధి మార్గాన్ని తాము ఎప్పటికీ ఉపయోగించబోమని, ఇతర దేశాలే దీని పరిరక్షణకు ముందుకు రావాలని సూచించారు. ఇరాన్ ముప్పు తొలగిపోయాక, అమెరికా ప్రధాన పాత్ర అవసరం ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఆయా దేశాలకు ఓ సులభమైన సైనిక ఆపరేషన్ అని అభివర్ణించారు.
ప్రపంచ ఇంధన సరఫరాకు 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' చాలా కీలకమైన జలమార్గం. ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ రవాణా అవుతుంది. ఇటీవల వారాల్లో ఈ ప్రాంతంలో జరిగిన దాడులు, ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై కూడా గణనీయమైన ప్రభావం చూపాయి. ఈ యుద్ధం దాదాపు మూడు వారాలుగా కొనసాగుతున్న సమయంలో, ఈ రీజియన్ లో అస్థిరత నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతకుముందే జపాన్ సహా వివిధ దేశాలు కూడా హార్ముజ్ జలసంధిని విడిపించడానికి ముందుకొచ్చాయి కూడా.
-
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
ముంచుకొస్తున్న గ్యాస్ సంక్షోభం.. పాత బుకింగ్‌లకే దిక్కులేని పరిస్థితి! -
పారాసెటమాల్, బీపీ టాబ్లెట్ల రేట్లు భారీగా పెంపు? -
కేంద్రం వరాల సునామీ -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
యుద్ధంపై ప్రధాని మోదీ కీలక మీటింగ్.. సంచలన నిర్ణయాలు ఇవే.. -
ఈ సాయంత్రం మోదీ అత్యవసర భేటీ- కఠిన నిర్ణయాల దిశగా కేంద్రం? -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
ఇజ్రాయెల్ భీకర ప్రతీకారం: హిజ్బుల్లా మాస్టర్‌మైండ్ హతం! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications