Donald trump: బుల్లెట్ స్పీడుతో ట్రంప్ .. ఆ అధికారులంతా అవుట్..!
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ వచ్చీ రాగానే అందరికీ షాకులిస్తున్నారు. అమెరికాలో అధికారం మారినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని భావించిన వారంతా ఇప్పుడు ట్రంప్ దూకుడుతో షాకవుతున్నారు. ముఖ్యంగా గత బైడెన్ ప్రభుత్వంలో కీలక స్ధానాల్లో ఉన్న అధికారులను వచ్చీ రాగానే ట్రంప్ తొలగించేశారు. ఏమాత్రం ఊహించని విధంగా ట్రంప్ ఇస్తున్న షాకులతో ప్రభుత్వ యంత్రాంగం బెంబేలెత్తుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకుని ఆఫీసులో ఎంటర్ కాగానే అక్కడ కనిపించిన నలుగురు సీనియర్ అధికారుల్ని సాగనంపేశారు. అదే సమయంలో మరో వెయ్యి మందికి పైగా ఇంటికి వెళ్లాల్సిందేనని సంకేతాలు ఇచ్చేశారు. తన ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే తన మొదటి ట్రూత్ సోషల్ పోస్ట్‌లో వెయ్యి మందికి పైగా అధికారుల్న త్వరలో తొలగిస్తానని ట్రంప్ తేల్చిచెప్పేశారు.

అమెరికాను మళ్లీ గొప్పగా మార్చాలనే తన ఆలోచనకు అనుగుణంగా లేని, గత ప్రభుత్వ హయాంలో ఉన్న వెయ్యి మందికి పైగా నియామకాలను గుర్తించి, తొలగించే ప్రక్రియలో తన అధ్యక్ష కార్యాలయం బిజీగా ఉందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
అధ్యక్షుడిగా ఓ నలుగురిని తక్షణం తొలగిస్తున్నట్లు కూడా వెల్లడించారు. క్రీడలు, ఫిట్‌నెస్, పోషకాహారంపై అధ్యక్షుడి కౌన్సిల్ నుండి జోస్ ఆండ్రెస్, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీ కౌన్సిల్ నుండి మార్క్ మిల్లీ, విల్సన్ సెంటర్ ఫర్ స్కాలర్స్ నుండి బ్రియాన్ హుక్, అధ్యక్షుడి ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ నుండి కైషా లాన్స్ బాటమ్స్ తొలగించిన వారిలో ఉన్నారు.
ఇది శాంపుల్ మాత్రమేనని, ఈ లిస్ట్ లో చాలా మంది ఉండబోతున్నారని కూడా ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో వెల్లడించారు. దీంతో తర్వాతి స్ధానంలో ఎవరుంటారో తెలియక అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో తాను చేసిన టీవీ ప్రోగ్రాం "ది అప్రెంటీస్" లో చేసిన పద ప్రయోగం "యు ఆర్ ఫైర్డ్!"తో ఈ పోస్టును ట్రంప్ ముగించారు. అమెరికా ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ట్రంప్ మార్క్ తొలగింపులు ఉంటాయని తెలుస్తోంది.
-
ఇరాన్ తో డీల్ లేనట్లేనా ? సర్వనాశనమే- ట్రంప్ ఫైనల్ వార్నింగ్..! -
ఇరాన్ లో మా టార్గెట్ అదే..! అసలు ప్లాన్ బయటపెట్టిన ట్రంప్..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications