Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముస్లింలపై నా వైఖరే సరైంది: ఓర్లాండ్ ఘటనపై ట్రంప్

ఒర్లాండో: ఓర్లాండ్ ఘటనతో ముస్లింలపై తన వైఖరి సరైనదేనని మరోసారు రుజువైందని రిపబ్లికన్ల తరుపున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్ట్ ట్రంఫ్ వ్యాఖ్యానించారు. అమెరికాలోని ఒర్లాండో గే నైట్‌క్లబ్‌ కాల్పుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.

గే నైట్‌క్లబ్‌పై జరిగిన దాడిని ఒబామా తీవ్రంగా ఖండించలేకపోయారని అన్నారు. ఇది ఇస్లాం ముస్కరుల పనేనని ట్వీట్ చేసిన డొనాల్ట్ ట్రంప్, కాదని అంగీకరించకుంటే ఒబామా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఎన్నికైతే, అమెరికాకు వచ్చే ముస్లింలపై నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయని అన్నారు.

"మగాళ్లు ముద్దులు పెట్టుకోవడం ఇష్టం లేకే చంపేశా"
ఒర్లాండోలోని పల్స్ నైట్‌క్లబ్‌పై ఓ ముష్కరుడు చేసిన దాడిలో 50 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఘటనపై డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో తీవ్రస్థాయిలో స్పందించారు. ఉగ్రవాదులపై, ముస్లింలపై తన దృక్పథం కరెక్టేనని ఈ ఘటన నిరూపించిందని, అమెరికన్లు మరింత తెలివిగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందంటూ ఆయన వరుస ట్వీట్లు చేశారు.

Donald Trump Seizes on Orlando Shooting and Repeats Call for Temporary Ban on Muslim Migration

నైట్‌క్లబ్‌లో జరిపిన కాల్పుల సమయంలో ఒమర్‌ అల్లాహు అక్బర్‌ అంటూ అరిచాడని ట్వీట్ చేశారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజాన్ని కూకటివేళ్లతో పెకిలించి తీరాల్సిందేనని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఈ దాడి ఘటనపై హిల్లరీ క్లింటన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఆమె అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకోవాలని ట్రంప్ డిమాండ్ చేశారు.

అమెరికాను పాలిస్తున్న నేతలు బలహీనులని, అందువల్లే దేశ ప్రజలపై దాడులకు ముష్కరులు తెగబడుతున్నారని ఆయన విమర్శించారు. పాలకులు కఠినంగా లేకుంటే, ఓర్లాండోలో జరిగిన ఘటనలు మరిన్ని చూడాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఒర్లాండోలో దాడి నేపథ్యంలో ట్రంప్‌, క్లింటన్‌ తమ ప్రచారాలను వాయిదా వేశారు.

దారుణమైన హత్యాకాండ: ఒబామా

ఓర్లాండో క్లబ్‌ నరమేధం 'ఉన్మాద దాడి', 'ద్వేషపూరిత దాడి' అని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించారు. ఈ ఘటనను యావత అమెరికన్లపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు.

ఇది దారుణమైన హత్యాకాండ అని పేర్కొన్న ఒబామా, అమాయక ప్రజలను ఊతకోచ కోశారని ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటామని, ఇలాంటి కష్టకాలంలో వాటి నుంచి దూరంగా పారిపోకుండా, సమైక్యంగా జాతి యావత ఒకేతాటిపై నిలుస్తుందని చెప్పారు.

ప్రస్తుతం దాడికి సంబంధించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, విషయాలను రాబడుతున్నామని ఆయన చెప్పారు. అమెరికా చరిత్రలోనే ఇదో అత్యంత దారుణమైన నరమేధమని అన్నారు. ఫ్లోరిడా దాడికి సంతాపంగా వైట్‌ హౌజ్‌పై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+