అమెరికాలో సీన్ రివర్స్..! వలసల బహిష్కరణపై ముందుకెళ్లలేని ట్రంప్ ?

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే వలసలపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ కు తాజాగా ఈ వ్యవహారంలో భారీ షాకులు తగిలినట్లు తెలుస్తోంది. వలసదారుల్ని వారి స్వదేశాలకు తమ విమానాల్లోనే పంపుతూ, వారిని స్వాగతించని దేశాలపై ఆంక్షల కొరడా విధిస్తున్న ట్రంప్ కు ఇప్పుడు తన స్వదేశంలోనే షాకులు మొదలైనట్లు తెలుస్తోంది. అధ్యక్షుడిగా నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న ట్రంప్.. 25 వేలకు పైగా వలసల్ని వారి దేశాలకు పంపేశారు. ఈ క్రమంలో ఎదురైన సమస్యలతో ఆ ప్రక్రియను పక్కనబెట్టేస్తున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో అక్రమ వలసల పేరుతో సాగిస్తున్న బహిష్కరణల పర్వం ఇప్పుడు ఆ దేశ ఆర్ధిక రంగానికి చుట్టుకుంటోంది. కీలక రంగాల్లో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వలసదారులపై తనిఖీలు నిర్వహించడం, పట్టుబడిన వారిని స్వదేశాలకు పంపేస్తుండటంతో ఆ ప్రభావం ఆర్ధిక వ్యవస్థపై మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరి స్ధానంలో ఆయా రంగాల్లో పరిశ్రమలు ఎక్కువ వేతనాలకు అమెరికన్లనే నియమించుకోవాల్సిన పరిస్ధితులు ఎదురవుతున్నాయి. దీంతో ఈ రంగాలపై ప్రభావం పడుతోంది.

Donald trump slowdown unlawful immigrants deportations due to lack of funds impact on economy

అదే సమయంలో వలసదారుల బహిష్కరణకు తొలి నెల రోజుల్లోనే భారీ ఎత్తున నిధులు ఖర్చుపెట్టేసిన ట్రంప్ కు ఇమ్మిగ్రేషన్ విభాగం తాజాగా షాకిచ్చినట్లు తెలుస్తోంది. నిధుల లేమి కారణంగా ఇక వలసల బహిష్కరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లలేమని ట్రంప్ కు చెప్పినట్లు సమాచారం. అంతే కాదు వచ్చే నాలుగేళ్లలో వలసల బహిష్కరణకు ఏకంగా 175 బిలియన్ డాలర్ల నిధులు ఖర్చవుతాయని అంచనా వేసి, వాటిని ఇమ్మని కాంగ్రెస్ కు విన్నవించుకుంది. అంత భారీ నిధులు ఇచ్చేందుకు కాంగ్రెస్ కూడా సిద్దంగా లేదు. దీంతో వలసల తరలింపులో దూకుడు తగ్గిపోయింది.

Take a Poll

అమెరికా నుంచి వలసల బహిష్కరణ కారణంగా పలు రంగాల్లో పరిశ్రమలతో పాటు వాటిని నడుపుతున్న వ్యక్తులపైనా తీవ్ర ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అక్రమ వలసల సంఖ్య కేవలం 5 శాతం మాత్రమే. కానీ వ్యవసాయ కార్మికుల్లో మాత్రం ఏకంగా సగం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరందరినీ తరిమేయడం మొదలుపెట్టాక ఆహార రంగంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో భాగమైన రెస్టారెంట్లు, ఫుడ్ వ్యాపారాలపై ఎక్కువగా ఈ ప్రభావం పడుతోంది.అలాగే అమెరికాకు వీరి వల్ల ఇప్పటివరకూ వస్తున్న పన్ను చెల్లింపులు నిలిచిపోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+