Donald Trump : జార్జియా కేసులో లొంగిపోయేందుకు ట్రంప్ రెడీ-వెంటనే విడుదలకు ప్లాన్..!

అమెరికాలో ఒకప్పుడు అధ్యక్షుడిగా ఓ వెలుగు వెలిగి .. అనంతరం ఎన్నికల్లో ఓడిపోయాక వరుస కేసుల్లో ఇరుక్కుని విలవిల్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వాటి నుంచి విముక్తి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ఎలాగైనా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్న ట్రంప్ అందులో భాగంగా తనపై కేసుల్లో అరెస్టు కాకుండా, ఒక వేళ లొంగిపోయినా విడుదలయ్యేలా న్యాయాధికారులతో చర్చలు జరుపుతున్నారు.

జార్జియా కుట్ర కేసులో ఈ శుక్రవారం లోపు లొంగిపోవాలని లేదా అరెస్టు కావాలని కోర్టు ట్రంప్ కు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో వచ్చే ఏడాది మార్చి 4 విచారణకు ప్రాసిక్యూటర్లు కోర్టులో ప్రతిపాదిస్తుండగా.. ట్రంప్ లాయర్లు మాత్రం 2026కు విచారణ వాయిదా వేయాలని కోరుతున్నారు. ఈ దశలో ట్రంప్ గురువారం లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్ధి తొలి బహిరంగ చర్చకు సిద్ధమవుతున్న ఒక్క రోజు ముందు ట్రంప్ లొంగిపోతారని సమాచారం. 2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత జార్జియాలో చేసిన కుట్ర కేసులో ట్రంప్ పై అభియోగాలు ఉన్నాయి. దీంతో జార్జియా కేసులో విముక్తి కోసం ప్రస్తుతం ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు.

Donald Trump :

ఇందుకోసం అనుసరించాల్సిన నిబంధనలు, షరతులపై చర్చించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ సమ్మతి బాండ్, విడుదల పరిస్థితులపై సోమవారం ఫుల్టన్ కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయంతో చర్చల సందర్భంగా ఆయన విడుదలకు ఫైనల్ తేదీ నిర్ణయించినట్లు తెలిసిందని సీఎన్ఎన్ తెలిపింది. గత వారం బయటపడిన 98 పేజీల జార్జియా నేరారోపణలో 2020 ఎన్నికల్లో రాష్ట్రంలో ట్రంప్ ఓటమిని తిప్పికొట్టే ప్రయత్నాలకు సంబంధించి ట్రంప్ తో పాటు 18 మంది ఇతర నిందితులపై మొత్తం 41 నేరారోపణలు ఉన్నాయి.

జార్జియా కేసులో విడుదలకు ట్రంప్ 2 లక్షల యూఎస్ డాలర్ల బాండ్ సమర్పించాల్సి ఉంటుందని షరతు విధించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకూ ఎలాంటి సోషల్ మీడియా సందేశాలు, బెదిరింపు మెసేజ్ లు పంపకుండా ఆంక్షలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్రంప్ న్యాయవాదులు, ఫుల్టన్ కంట్రీ డిస్ట్రిక్ట్ అటార్నీ బాండ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. సాక్షులను బెదిరించడం, న్యాయాన్ని అడ్డుకోవడంపై షరతులతో సహా విడుదల నిబంధనలను కూడా ఈ పత్రం రూపొందించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+