పాకిస్తాన్ తో యుద్ధం వేళ.. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంప బీభత్సం
Afghanistan earthquake: కొన్ని గంటల వ్యవధిలో రెండు భూకంపాలు ఆఫ్ఘనిస్తాన్‌ను కుదిపేశాయి. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించాయి. రాజధాని కాబూల్, ఫైజాబాద్ సమీపంలో సంభవించాయి ఈ రెండూ కూడా. దీనివల్ల ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు వార్తలు అందలేదు గానీ కొన్ని చోట్ల నివాసాలు దెబ్బతిన్నాయి. పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ప్రధాన భూకంపాల తర్వాత కూడా ప్రకంపనలు సంభవిస్తోండటంతో స్థానికులు ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. చాలాసేపు ఆరుబయటే గడిపారు.
తాజా భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5, 4.6గా రికార్డయింది. తొలి భూకంపం ఆదివారం రాత్రి శనివారం సాయత్రం 7:31 నిమిషాలకు సంభవించింది. దీని తీవ్రత 4.5. 34.942 ఉత్తర అక్షాంశం, 70.070 తూర్పు అక్షాంశం పరిధిలోకి వచ్చే ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఉపరితలం నుంచి 130 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు తెలిపింది. కాబుల్ సమీపంలోని డే సబ్జా, ఖాదిర్ ఖిల్, భక్తియారన్ వంటి ప్రాంతాలపై దీని ప్రభావం పడింది.

మరో భూకంపం రాత్రి 10:43 నిమిషాల సమయంలో సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.6గా రికార్డయింది. 36.167 ఉత్తర అక్షాంశం, 70.850 తూర్పు అక్షాంశం సమీపంలోని ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఉపరితలం నుంచి 82 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. దీని ప్రభావం షా-ఎ-అంజుమన్, స్కజార్ వంటి ప్రాంతాల్లో కనిపించింది. అక్కడక్కడ నివాసాలు దెబ్బతిన్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 4 లేదా అంతకంటే తీవ్రతతో వరుసగా భూమి ప్రకపించడం ఈ మధ్యకాలంలో తీవ్రతరమైంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుందీ దేశం. కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్.. రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు. గత ఏడాది సంభవించిన వినాశకరమైన భూకంపం 2,200 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications