El Mencho :ట్రంప్ వార్నింగ్‌తో డ్రగ్ డాన్ ఎల్ మెంచో హతం- తగలబడుతోన్న మెక్సికో.!!
మెక్సికోలో అత్యంత శక్తివంతమైన,క్రూరమైన డ్రగ్ మాఫియా సామ్రాజ్యం కుప్పకూలింది.దశాబ్ద కాలంగా ప్రపంచ దేశాలను, ముఖ్యంగా అమెరికాను వణికించిన 'జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్' (CJNG) అధినేత నెమెసియో ఒసెగ్వెరా సెర్వాంటెస్ (అలియాస్ ఎల్ మెంచో) మెక్సికో సైన్యం జరిపిన మెరుపు దాడిలో హతమయ్యాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో జరిగిన ఈ ఆపరేషన్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఆపరేషన్ తపాల్పా:తుపాకుల మోత మధ్య డ్రగ్ కింగ్ పతనం
మెక్సికోలోని పశ్చిమ రాష్ట్రమైన జాలిస్కోలోని తపాల్పా ప్రాంతంలో మెక్సికన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ రహస్య ఆపరేషన్ నిర్వహించాయి. సైన్యానికి, డ్రగ్ ముఠాకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో నలుగురు కార్టెల్ సభ్యులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఎల్ మెంచోను మెక్సికో సిటీలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మెక్సికన్ సైనికులు కూడా గాయపడ్డారు. జూన్‌లో జరగనున్న నార్త్ అమెరికా వరల్డ్ కప్ మ్యాచ్‌లకు జాలిస్కో ఆతిథ్యం ఇవ్వనున్న తరుణంలో ఈ ఆపరేషన్ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎవరీ ఎల్ మెంచో? ఎందుకు ఇంత భయం?
ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసిన సెర్వాంటెస్,ఆ తర్వాత నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి CJNG ముఠాను స్థాపించాడు.ఫెంటానిల్,కొకైన్ వంటి ప్రాణాంతక మాదకద్రవ్యాలను అమెరికాకు అక్రమంగా రవాణా చేయడంలో ఇతను సిద్ధహస్తుడు.ఇతని ఆచూకీ తెలిపిన వారికి అమెరికా గతంలో 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 125 కోట్లు)భారీ రివార్డును కూడా ప్రకటించింది.కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా మెక్సికో సైన్యంపైనే దాడులు చేయగల తెగింపు ఎల్ మెంచో సొంతం.
ట్రంప్ హెచ్చరికలు.. షీన్‌బామ్ వ్యూహం
అమెరికాలో డ్రగ్స్ వల్ల జరుగుతున్న మరణాలపై ఆగ్రహంతో ఉన్న డొనాల్డ్ ట్రంప్,ఇటీవల ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు."మెక్సికో సరిహద్దుల్లో డ్రగ్ కార్టెల్స్‌ను అడ్డుకోవడానికి మేము సైనిక దాడులు మొదలుపెడతాం" అని హెచ్చరించారు. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ప్రభుత్వం ఈ మెరుపు దాడిని ప్లాన్ చేసింది. అమెరికా జోక్యం పెరగకముందే తామే చర్యలు తీసుకున్నామని నిరూపించుకోవడానికి ఈ ఆపరేషన్ సహాయపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మంటల్లో మెక్సికో
తమ నాయకుడు హతమయ్యాడన్న వార్త తెలియగానే CJNG ముఠా సభ్యులు మెక్సికో అంతటా విధ్వంసానికి దిగారు.కనీసం ఆరు రాష్ట్రాల్లో వాహనాలను తగులబెట్టడం,హైవేలను దిగ్బంధించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గువానాజువాటో రాష్ట్రంలో ఫార్మసీలు, కన్వీనియన్స్ స్టోర్లకు నిప్పు పెట్టారు.జాలిస్కో అంతటా నల్లటి పొగలు కమ్ముకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రభుత్వం ప్రస్తుతం శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
ఒక క్రూరమైన మాఫియా శకం ముగిసినా,మెక్సికో వీధుల్లో మాత్రం ఇంకా తుపాకుల మోత వినిపిస్తూనే ఉంది.ఎల్ మెంచో పతనం మెక్సికో-అమెరికా సంబంధాల్లో కొత్త మలుపు కానుందా? లేక ఈ హింస మరిన్ని కొత్త ముఠాల ఆవిర్భావానికి దారితీస్తుందా? అనేది కాలమే నిర్ణయించాలి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications