బయటకొచ్చిన గడాఫి కొడుకు, సంక్షోభం ఆందోళన

Posted By:
Subscribe to Oneindia Telugu

లిబియా: లిబియా ఒకప్పటి నియంత కల్నల్‌ గడాఫీ తనయుడు సైఫ్‌ అల్‌ ఇస్లాం గడాఫీ జైలు నుంచి క్షమాభిక్షపై బయటకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అతను గత ఆరేళ్ల నుంచి మిలీషీయా గ్రూప్‌ వద్ద బందీగా ఉన్నాడు. విడుదల అనంతరం కొంతమంది బంధువులతో కలిసి బ్యాడ పట్టణంలో ఉన్నట్లు భావిస్తున్నారు.

Gaddafi's son Saif 'freed' in Libya

ఆపద్ధర్మ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సైఫ్‌ను వదిలివేసినట్లు చెబుతున్నారు. లిబియా తూర్పు ప్రాంతంలోని ప్రభుత్వం ఇప్పటికే సైఫ్‌కు క్షమాభిక్ష ఇచ్చింది.

గతంలో ఐరాస మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వ హయాంలో ట్రిపోలీ కోర్టు ఆయనకు మరణశిక్షను విధించింది. సైఫ్‌కు స్వేచ్ఛ వస్తే లిబియాలో సంక్షోభం మరోసారి ముదిరిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో గడాఫీ వారసుడిగా సైఫ్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. సైఫ్‌ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో 2008లో పీహెచ్‌డీ చేశారు. ఆయనకు పాశ్చాత్య దేశాలతో సంబంధాలు ఉన్నాయి.

గడాఫీ పాలనలో పశ్చిమ దేశాలతో సంబంధాలు నెరపడంలో కీలక పాత్రను పోషించారు. 2011లో లిబియా నుంచి నైగర్‌ పారిపోతుండగా ఎడారిలో ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఆందోళనకారుల హత్యలకు సంబంధించి కేసులో నేరం రుజువు కావడంతో మరణశిక్ష విధించారు. తాజాగా లిబియాలోని పోటీ ప్రభుత్వాల్లో ఒకదాని ద్వారా క్షమాభిక్ష పొంది బయటకు వచ్చాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Saif al Islam Gaddafi, second son of the late deposed Libyan leader Col Muammar Gaddafi, is said to have been freed under an amnesty, in a move which could fuel further instability.
Please Wait while comments are loading...