గూగుల్ మ్యాప్స్ క్రాష్-మొబైల్, వెబ్ లోనూ- గంటకు పైగా వాహనదారులకు చుక్కలు

ప్రపంచ వ్యాప్తంగా రోడ్లపై వాహన దారులకు అడ్రస్ లు చెప్తూ, దారి చూపిస్తున్న గూగుల్ మ్యాప్ భారత్ లో తాజాగా కాసేపు క్రాష్ అయింది. దాదాపు గంటకు పైగా మొబైల్, వెబ్ లలోనూ ఇది పనిచేయలేదు. దీంతో అప్పటివరకూ గూగుల్ మ్యాప్ లను నమ్ముకున్న యూజర్లందరికీ చుక్కలుకనిపించాయి. వాహనదారుల బాధలైతే వర్ణనాతీతం.

భారత్ వంటి జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే దేశాల్లో వాహనదారులు కొత్త ప్రాంతాల్లో అడ్రస్ లు తెలుసుకునేందుకు, దారి తెలుసుకునేందుకు గూగుల్ మ్యాప్స్ ఎంతో ఉపయోగపడుతోంది. ఇంతగా జనం అలవాటుపడిపోయిన గూగుల్ మ్యాప్స్ ఒక్కసారిగా క్రాష్ కావడంతో రోడ్లపై వెళ్లే వారు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. స్విగ్గీ, జొమాటో బాయ్ ల దగ్గరి నుంచి రవాణా వాహనాల డ్రైవర్లు, సాధారణ యూజర్లు కూడా అయోమయానికి గురయ్యారు. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయగానే బ్లాంక్ పేజీ దర్శనమివ్వడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు తిరిగి గూగుల్ లో సెర్చ్ లు చేశారు.

Google Maps crash: Billions across the globe faced difficulty in finding directions

డౌన్‌డెటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం, గూగుల్ మ్యాప్స్ భారత్ వ్యాప్తంగా అందుబాటులో లేకుండా పోయింది. దీంతో ప్రజలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా రోడ్డుపై వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇన్నేళ్లలో తొలిసారి ఇలా జరగడంపై సోషల్ మీడియాలోనూ విపరీతంగా చర్చ జరిగింది. నెటిజన్లు దీనిపై సెటైర్లు కూడా వేసుకోవడం మొదలుపెట్టారు.

గూగుల్ మ్యాప్స్ క్రాష్ కావడంతో తిరిగి గూగుల్ లోనే అడ్రస్ ల కోసం సెర్చ్ చేసుకోవాల్సి వచ్చిందంటూ నెటిజన్లు వాపోయారు. అదే సమయంలో యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్ వాడుతున్న వారు యాపిల్ మ్యాప్ లపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో వారికి మాత్రం కాస్త ఊరట లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+