వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రార్థనలు చేస్తుండగా మసీదులో కాల్పులు: ఐదుగురు మృతి

కెనడాలోని క్యూబెక్‌ సిటీలో మసీదులో ఆదివారం సాయంత్రం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో కాల్పులు చోటుచేసుకోవడంతో పలువురు మృతి చెందారు.

|
Google Oneindia TeluguNews

క్యూబెక్‌ సిటీ: కెనడాలోని క్యూబెక్‌ సిటీలో మసీదులో ఆదివారం సాయంత్రం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో కాల్పులు చోటుచేసుకోవడంతో పలువురు మృతి చెందారు. మృతుల సంఖ్య కచ్చితంగా ఎంత అన్నది తెలియలేదు. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఐదుగురు వ్యక్తులు మృతి చెందినట్లు తెలిసింది.

ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మసీదు డైరెక్టర్‌ కథనం ప్రకారం.. క్యూబెక్‌ సిటీలోని మసీదులో ఆదివారం సాయంత్రం ప్రార్థనలు చేసుకుంటున్న దాదాపు 40 మందిపై ముగ్గురు గన్‌మెన్లు కాల్పులు జరిపినట్లు తెలిసింది. దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు భద్రతా దళాలు చట్టుముట్టాయి.

ప్రత్యక్ష సాక్షుల చెబుతున్న వివరాల ప్రకారం.. మసీదులోకి ముసుగు ధరించిన సాయుధలు వచ్చారు. వారి వద్ద ఏకే 47 తుపాకీ ఉందని.. ప్రార్థనలు మొదలు పెట్టగానే వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఇద్దరు సాయుధులు ఈ ఘటనలో పాల్గొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Gunmen open fire at Quebec mosque, 5 killed

ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చట్టుముట్టి గాలింపు చేపట్టగా ఓ వంతెన వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సాయుధుల్లో ఒకరి వయస్సు 27 సంవత్సరాలు ఉండవచ్చని, అతని పేరు క్యూబెకోగా భావిస్తున్నారు. కాల్పులకు కారణమైన వారి కోసం ప్రస్తుతం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

దాదాపు 20 పోలీసు వాహనాలు.. అంబులెన్స్‌లతో ఆ ప్రాంతం నిండిపోయింది. ఈ దృశ్యాలను చిత్రీకరించిన వీడియోలో కొన్ని అరుపులను బట్టి నిందితుల వద్ద ఎటువంటి వాహనాలు లేవని వారు పరిగెత్తి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

మీతోనే ఉన్నా: జస్టిన్‌ ట్రూడ్యూ

ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడ్యూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానన్నారు. కాగా, శరణార్థులు తమ దేశానికి రావచ్చని కెనడా ప్రధాని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

English summary
Five people were reportedly killed and several injured after three gunmen opened fire at a mosque here, the mosque's president Mohamed Yangui has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X