వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్-1బి ప్రీమియం వీసా ప్రాసెసింగ్ నిలిపివేత: అమెరికా ఇమ్మిగ్రేషన్ ప్రకటన

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రీమియం వీసా ప్రాసెసింగ్‌ను ఆరు నెలలపాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా ఇమ్మిగ్రేషన్ ప్రకటించింది. హెచ్-1బి వీసాలకు మాత్రం ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంగళవారం తెలిపింది.

ప్రాసెసింగ్‌లో సమయాన్ని ఆదాచేసే ఉద్దేశంతో హెచ్1బీ ప్రీమియం వీసా ప్రాసెసింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపింది. హెచ్‌1 బీ వీసా పిటిషన్ల ప్రీమియం ప్రాసెసింగ్ రద్దు సెప్టెంబరు 10, 2018 వరకు కొనసాగుతుందని పేర్కొంది.

H-1B application process to begin from April 2

తిరిగి ఈ ప్రక్రియ 2018 అక్టోబరు 1న ప్రారంభమవుతుందని యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. తాత్కాలికంగా ప్రీమియం ప్రాసెసింగ్‌ను నిలిపివేయడం ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను క్లియర్ చేయవచ్చునని ఏజెన్సీ భావిస్తోంది.

కాగా, అమెరికా ప్రభుత్వం ఏటా 65 వేలకుపైగా హెచ్1బీ వీసాలను జారీ చేస్తుంది. యూఎస్ సిఐఎస్ లెక్కల ప్రకారం 2007-12 మధ్య కాలంలో అత్యధికంగా భారతీయుల నుంచి 2.12మిలియన్ల హెచ్1బి వీసా పిటిషన్లు అమెరికన్ ఇమ్మిగ్రేషన్‌కు అందాయి.

English summary
The US Citizenship and Immigration Services (USCIS) also announced the suspension of premium processing of all H-1B petitions which are subject to the annual caps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X