అమెరికాలో కాల్పుల కలకలం: యూదులంతా చావాల్సిందేనంటూ పైరింగ్, 11 మంది మృతి
పిట్స్‌బర్గ్: ఆమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో యూదుల ప్రార్థనా మందిరం వద్ద శనివారం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది వరకు మృతి చెందారు. మరో అరడజను మంది గాయపడ్డారు. ప్రార్థనలు జరుపుతున్న సమయంలో ఓ ముష్కరుడు లోనికి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
దుండగుడు సెమీ అటోమేటిక్ రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు కూడా గాయపడ్డారు.

నిందితుడిని రాబోర్ట్ బోయర్స్‌గా గుర్తించారు. అతని వయస్సు 46. దుండగుడు కాల్పులు జరిపే స్యంలో యూదులు అందరూ చనిపోవాల్సిందేనని నినాదాలు చేశాడు. కాల్పులకు ముందు అతను తన సోషల్ మీడియా అకౌంట్లో యూతులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు.
అతనిపై పోలీసులు విద్వేషపూరిత దాడి, మరణశిక్ష పడే ఇతర ఫెడరల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడి వద్ద సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో పాటు మరో మూడు హ్యాండ్ గన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రంప్ ఈ ఘటనపై సమీక్ష నిర్వహిస్తున్నారని వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు. కాల్పుల ఘటన విషాదకరమని పెన్సిల్వేనియా గవర్నర్ టామ్ ఉల్ఫ్ అన్నారు.












Click it and Unblock the Notifications