పాక్‌లో దారుణం: ఇంట్లో దూరి హిందూ బాలిక కిడ్నాప్, మతమార్పిడి పెళ్లి

Subscribe to Oneindia Telugu

కరాచీ: పాకిస్తాన్‌లో హిందువులపై జరుగుతున్న అరాచకాలు ఆగడం లేదు. తాజాగా సింధ్‌ ప్రావిన్స్‌లోని థార్‌లో గ్రామంలో నివాసముంటున్న ఒక హిందూ బాలికను ముగ్గురు సాయుధులైన ముస్లింలు అపహరించారు.

అమ్మాయిల కిడ్నాప్‌లు, మతమార్పిళ్లు: పాక్‌లో భారీగా తగ్గిన హిందువులు, దయనీయం

అనంతరం బలవంతంగా మత మార్పిడి చేసి.. ఆ తర్వాత ముస్లిం వ్యక్తితో వివాహం కూడా చేశారు. ఈ మేరకు పాకిస్తాన్‌కు చెందిన డాన్‌ పత్రిక వార్తను ప్రచురించింది. ఈ ఘటనపై బాలిక తండ్రి హీరో మేఘావర్‌.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాన్‌ తెలిపింది.

 ఇంట్లో దూరి అపహరణ

ఇంట్లో దూరి అపహరణ

రెండు రోజులు కిందట ముగ్గురు సాయుధలైన వ్యక్తులు తమ ఇంటిలోనికి ప్రవేశించి.. తమ కుటుంబసభ్యులను బంధించినట్లు మేఘవార్‌ చెప్పారు. అనంతరం తన మైనర్‌ కుమార్తె (14 సంవత్సరాలు)ను వారు ఎత్తుకెళ్లినట్లు ఆయన తెలిపారు.

 బలవంతపు మతమార్పిడి, వివాహం

బలవంతపు మతమార్పిడి, వివాహం

ఈ విషయంపై స్థానిక నేతలను, పోలీసులను సంప్రదించినా ఎవరినుంచి స్పందన రాలేదని మేఘావర్ వాపోయారు. చివరగా నసీర్‌ లుంజో అనే వ్యక్తి.. తమ కుమార్తెను బలవంతపు మతమార్పిడి చేసి వివాహం చేసుకున్నట్లు తెలిసిందని అన్నారు.

స్పందించిన ఎస్ఎస్పీ

స్పందించిన ఎస్ఎస్పీ

స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో.. మేఘవార్‌ సింథ్‌ ఎస్‌ఎస్‌పీ అధికారిని కలిశారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. బాధిత బాలిక కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

 తండ్రి ఆవేదన, ఆగ్రహం

తండ్రి ఆవేదన, ఆగ్రహం

బాలిక మతమార్పిడికి సంబంధించిన సర్టిఫికెట్‌ ఒకటి పోలీసులకు అందిందని తెలిసింది. దీనిపై మేఘావర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ బలవంతపు పెళ్లిని వ్యతిరేకిస్తూ సింధ్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సింధ్‌ హైకోర్టు జనవరి17న విచారించనుంది. దేశ విభజన జరిగిన 1947నాటి పాకిస్థాన్‌లో హిందువులపై దాడులు, బలవంతపు మతమార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. 1947లో ఆ దేశంలో హిందువులు 23శాతం ఉండేవారు. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య 6శాతానికి పడిపోవడమే ఇందుకు నిదర్శనం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A teenage Hindu girl from a village in Thar was recently aducted, forced to convert to Islam and later made to enter a marriage, claimed her family and relatives on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి