వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విచిత్రం: హరికేన్ ‘ఇర్మా’ దెబ్బకు.. సముద్రమే మాయం! వైరల్ గా మారిన వీడియో..

ఇర్మా హరికేన్ దెబ్బకు బహమాస్ తీరంలో సముద్రం మాయమైంది. హరికేన్ ధాటికి సముద్రంలోని నీరంతా వెనక్కి వెళ్లిపోయింది. అప్పటి దాకా నీళ్లతో కళకళలాడిన బీచ్.. ఒక్కసారిగా ఎడారిగా తయారైంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా: ఇర్మా హరికేన్ దెబ్బకు బహమాస్ తీరంలో సముద్రం మాయమైంది. హరికేన్ ధాటికి సముద్రంలోని నీరంతా వెనక్కి వెళ్లిపోయింది. అప్పటి దాకా నీళ్లతో కళకళలాడిన బీచ్.. ఒక్కసారిగా ఎడారిగా తయారైంది.

మామూలుగా సముద్రంలో ఆటుపోట్లు సహజం. పౌర్ణమి, అమావాస్య సమయంలో ఇలాంటివి స్పష్టంగా కనిపిస్తుంటాయి. అయితే ఇర్మా ధాటికి ఏకంగా సముద్రమే కనిపించకుండా పోయింది. అది కూడా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 13 గంటలపాటు సముద్రం వెనక్కి వెళ్లిపోయింది.

bahamas-beach


ఇలా నీరు వెనక్కి వెళ్లడం, మళ్లీ రావడం వీడియోల్లో రికార్డైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. బహమాస్‌లో 700లకు పైగా ద్వీపాలున్నాయి. సముద్రానికి ఆనుకొని ఎన్నో బీచ్‌లు, రిసార్ట్‌లు ఉన్నాయి.

ఇర్మా విధ్వంసం తరువాత బీచ్‌లు, రిసార్ట్‌లకు చేరువలో ఉండే సముద్రం మాయమైంది. ఇర్మా పయనిస్తున్న మార్గంలో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దాదాపు 15 అడుగుల మేర ఉగ్ర అలలు విరుచుకుపడ్డాయి.

బహమాస్‌లో అయితే ఏకంగా సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. తిరిగి 13 గంటల తర్వాత సముద్రం యధాతథ స్థితికి వచ్చిందంటే అంతవరకు సముద్రంలో కల్లోలం కొనసాగిందని అర్థమవుతోంది.

బహమాస్ సముద్రాన్ని హరికేన్ ఎంతలా మాయం చేసిందంటే.. అసలు కనుచూపు మేరలో సముద్రం ఉందంటే కూడా తెలియని పరిస్థితి. బహమాస్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ రెండు చిత్రాలను ట్విట్టర్‌లో పెట్టారు. హరికేన్ అత్యధిక ఒత్తిడికి గురిచేసి నీటిని తనవైపు లాక్కోవడం వల్లే ఇలా జరిగిందని నిపుణులు చెబుతున్నారు.

English summary
One of the most dangerous effects of a major hurricane is storm surge: a kind of temporary, localized sea-level rise caused by high winds and low atmospheric pressure. Storm surge is what made Hurricane Sandy and Hurricane Katrina, the two most expensive tropical cyclones in American history, so damaging and deadly.Storm surge is one of the most famous symptoms of hurricanes—so much so that it’s easy to forget what it is: the movement of billions of gallons of ocean water. It’s a hurricane exerting so much power that it sucks up water from one place and moves it hundreds of miles away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X