అమెరికాలో ఫ్లోరిడా, కాలిఫోర్నియాకు హరికేన్ ముప్పు..! వారాంతంలో భారీ వర్షాల అలర్ట్..

అమెరికాకు ఈ వారాంతం హరికేన్ల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా కాలి ఫోర్నియాతో పాటు దక్షిణ ఫ్లోరిడా ప్రాంతాలకు ఈ వారాంతంలో హరికేన్ల కారణంగా భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉందని జాతీయ హరికేన్ సెంటర్ తాజాగా ప్రకటించింది. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు. వాస్తవానికి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇక్కడ హరికేన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ వాతావరణ మార్పు కారణంగా ముందే ఈ ప్రభావం కనిపిస్తోంది.

అట్లాంటిక్ మహాసముద్రం గుండా కదులుతున్న నాలుగు ఉష్ణమండల వ్యవస్థలు నిన్న రాత్రి నుంచి క్రమంగా బలపడుతూ ఉన్నాయి. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఈ వ్యవస్ధల కారణంగా.. దక్షిణ ఫ్లోరిడాలో భారీ వర్షాలు తప్పవని నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. మయామి-డేడ్, బ్రోవార్డ్‌తో సహా ఫ్లోరిడా కీస్, సౌత్ ఫ్లోరిడా, కొన్ని ప్రాంతాలలో 10 నుండి 15 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

hurricane to hit california, south florida on weekend-heavy rain alert

గత నెలలో వీచిన హరికేన్ల కారణంగా ఎదురైన వరద పరిస్ధితులు తిరిగి పునరావృతం కావొచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాస్తవానికి అట్లాంటిక్ హరికేన్ సీజన్ సెప్టెంబర్ 10 కల్లా టాప్ లో ఉంటుంది. వీటి రాక ఆగస్టు మధ్య, అక్టోబర్ మధ్య ఉంటుంది. కాబో వెర్డే దీవులకు పశ్చిమాన కొన్ని వందల మైళ్ల దూరంలో తూర్పు ఉష్ణమండల అట్లాంటిక్‌లో అల్పపీడన ప్రాంతం జల్లులు, ఉరుములతో కూడిన గాలివానల సంకేతాలను ఇస్తోంది.

ఈ వారాంతంలో సౌత్ ఫ్లోరిడా మీదుగా కదిలే ఉష్ణమండల వ్యవస్ధ.. పైకి ప్రయాణిస్తున్నందున అధిక వర్షపాతానికి కారణమవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ అది వచ్చే వారం అభివృద్ధి చెందితే మాత్రం రాష్ట్రం దాటి పశ్చిమ గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీర ప్రాంతంలోకి వెళ్లిపోతుందని అంచనా.

నేషనల్ హరికేన్ సెంటర్ మధ్య, తూర్పు అట్లాంటిక్, గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంతా అనేక ఉష్ణమండల వ్యవస్ధలను ట్రాక్ చేస్తోంది. ఈ అస్తవ్యస్తమైన ఉష్ణమండల తరంగాలు రేపు దక్షిణ ఫ్లోరిడాను చేరుకోవచ్చని భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఈ వారాంతంలో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఈ ప్రాంతాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. దీంతో ఫ్లోరిడా వాసులు అప్రత్తమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+