Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Iran Israel US war:గతేడాదే ఖమేనీ హత్యకు ప్లాన్..చివర్లో ఎందుకు మారింది..?

టెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమ ఆసియా ముఖచిత్రాన్ని మార్చేస్తూ, ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేత అయాతొల్లా అలీ ఖమేనీని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అయితే, సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఇదే ఖమేనీని చంపే అవకాశం ఇజ్రాయెల్‌కు వచ్చినా, అప్పుడు వద్దని వారించిన డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు ఎందుకు అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు? "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" వెనుక ఉన్న అసలు కారణాలేంటి? దీనిపై ప్రత్యేక కథనం.

అప్పుడు 'వద్దు'.. ఇప్పుడు ముగింపు

2025 జూన్‌లో ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ భారీ దాడులు చేసింది.ఖమేనీని అంతం చేసే ప్లాన్‌ను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సిద్ధం చేశారు. కానీ,అప్పుడు ట్రంప్ జోక్యం చేసుకుని ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.అయితే,ఫిబ్రవరి 28,2026న జరిగిన దాడిలో మాత్రం ఖమేనీతో పాటు ఆయన భార్య,కుమార్తె,అల్లుడు,మనవరాలు,రక్షణ మంత్రి సహా కీలక అధికారులందరినీ ఏరిపారేశారు. ఈ మార్పు వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

iran-israel-us-war-from-blocking-the-plan-to-approving-a-decisive-strike-what-changed-trump-s-iran

1. ట్రంప్‌పై హత్యాప్రయత్నాలు - వ్యక్తిగత కక్ష?
ఖమేనీని చంపిన రెండు రోజుల తర్వాత ట్రంప్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు.ఖమేనీ తనను రెండుసార్లు చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు.2024 జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్ చెవికి తగిలిన బుల్లెట్ గాయం,సెప్టెంబర్‌లో గోల్ఫ్ కోర్సులో జరిగిన దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉందని అమెరికా నిఘా సంస్థలు ప్రాథమిక ఆధారాలు సేకరించాయి.ఫర్హాద్ షాకేరీ అనే ఇరాన్ ఏజెంట్ ద్వారా ట్రంప్ హత్యాకాండకు ఇరాన్ ప్లాన్ చేసిందన్న వార్తలే ఇప్పుడు ఖమేనీ పతనానికి పునాది వేశాయి.

2. 'ముందస్తు' వ్యూహం - తప్పనిసరి దాడి?
అమెరికా నిఘా వర్గాల ప్రకారం..ఇరాన్ తన క్షిపణులతో అమెరికా స్థావరాలపై భారీ దాడికి సిద్ధమవుతోంది."మేము దెబ్బతినే వరకు చూస్తూ కూర్చోలేము. ఇరాన్ క్షిపణులను ప్రయోగించే ముందే వాటిని ధ్వంసం చేయడం మాకు రక్షణ కవచం లాంటిది" అని అమెరికా ఉన్నతాధికారులు పేర్కొన్నారు.ఇరాన్ నెలకు 100 క్షిపణులను తయారు చేసే స్థాయికి చేరుకోవడం,ఏ క్షణమైనా అమెరికా ఆస్తులపై దాడి జరిగే అవకాశం ఉండటంతోనే ట్రంప్ ముందస్తు దాడులకు ఆదేశించారు.

3. ఇరాన్ చరిత్రలో అత్యంత బలహీనమైన సమయం
యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ప్రకారం..ఇరాన్ ఇప్పుడు చరిత్రలోనే అత్యంత బలహీన స్థితిలో ఉంది.మతపరమైన ఉన్మాదులు అణ్వాయుధాలు పొందితే ప్రపంచానికి ముప్పు ఉందని తెలిసి... వారి క్షిపణి వ్యవస్థను,నౌకాదళాన్ని,డ్రోన్ల తయారీని దెబ్బకొట్టడానికి ఇదే సరైన సమయమని ట్రంప్ భావించినట్లు రూబియో స్పష్టం చేశారు.

ట్రంప్ స్పందన:ఇది న్యాయం

ఖమేనీని చరిత్రలోనే అత్యంత క్రూరుడైన వ్యక్తిగా అభివర్ణించిన ట్రంప్,ఇది కేవలం ఇరాన్ ప్రజలకే కాకుండా ఇరాన్ చేతిలో దెబ్బతిన్న అమెరికన్లందరికీ దక్కిన న్యాయమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే గొప్ప అవకాశమని ఆయన పిలుపునిచ్చారు.

ప్రస్తుతం ఇరాన్ తన సుప్రీం లీడర్ మరణానికి ప్రతీకారంగా దుబాయ్,అబుదాబి,ఖతార్,బహ్రెయిన్ వంటి ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది.చర్చలకు సమయం మించిపోయిందని, ఇక జరిగేది యుద్ధమేనని ట్రంప్ హెచ్చరించడంతో మధ్యప్రాచ్యంలో టెన్షన్ పతాక స్థాయికి చేరింది.ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మొజ్తబా ఎన్నికయ్యారన్న వార్తల నేపథ్యంలో,రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+