ట్రంప్ స్ధానంలో తెలుగింటి అల్లుడు ? అమెరికాలో మారుతున్న లెక్కలు..!
ఇరాన్ పై అమెరికా మొదలుపెట్టిన వార్ ఇప్పట్లో ముగిసేలా లేదు. మరోవైపు యుద్దంలో అమెరికా నష్టాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో ట్రంప్ (donald trump) ఇప్పుడు ఇరాన్ (iran)ను సర్వనాశనం చేసే దిశగా అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ట్రంప్ నిర్ణయాలపై వ్యతిరేకత కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ట్రంప్ ను గద్దె దింపే విషయంపై ఆయన సొంత పార్టీతో పాటు డెమోక్రాట్లు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకు అమెరికా రాజ్యాంగంలోని ఓ రూల్ కలిసివస్తోంది.
అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ అధ్యక్ష వారసత్వం, అసమర్థతకు సంబంధించినది. అధ్యక్షుడు మరణించినా, రాజీనామా చేసినా, లేదా సేవ చేయడానికి అసమర్థుడైనా దీన్ని అమలు చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఇప్పుడు ఇరాన్ లో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన్ను ఈ 25వ రాజ్యాంగ సవరణ ద్వారా గద్దె దింపే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే ట్రంప్ స్ధానంలో ఎవరన్న ప్రశ్నకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (jd vance) సమాధానంగా కనిపిస్తున్నారు. తెలుగమ్మాయి ఉషా చిలుకూరి భర్త అయిన జేడీ వాన్స్ ను ట్రంప్ స్ధానంలో అధ్యక్షుడిగా చేసే అవకాశముంది.

ట్రంప్ ను తన సొంత కేబినెట్ అంతా కలిసి అధ్యక్షుడిగా పనికిరాడని భావిస్తే తక్షణం అతని అధికారాల్ని తాత్కాలికంగా ఉపాధ్యక్షుడికి బదిలీ చేయమని కోరే అవకాశం ఉంది. దీన్ని ఇప్పుడు అతని కేబినెట్ సహచరులు ప్రయోగించే అవకాశాలు ఉన్నాయనేది తాజా సమాచారం. అదే జరిగితే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు అమెరికా తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయి. వాస్తవానికి జేడీ వాన్స్ కూడా ట్రంప్ చర్యల్లో భాగస్వామి కాకుండా కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అలాగే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు కూడా గతంలో పలుమార్లు ప్రకటనలు కూడా చేశారు.












Click it and Unblock the Notifications