మైకేల్ పాటకు బిలియనీర్ జాక్ మా డ్యాన్స్: హోరెత్తించారు(వీడియో)

Subscribe to Oneindia Telugu

బీజింగ్: చైనాలోనేగాక, ప్ర‌పంచంలోని ధ‌న‌వంతుల్లో ఒక‌రైన అలీబాబా వ్య‌వ‌స్థాప‌కుడు జాక్ మా అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. త‌న కంపెనీ 18వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో వేదికపై అదిరిపోయే స్టెప్పులేసి ఉద్యోగులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.

అంతా షాక్..

అంతా షాక్..

దివంగత దిగ్గజ డ్యాన్సర్ మైకేల్ జాక్స‌న్ వ‌స్త్ర‌ధార‌ణ‌లోనే ‘డేంజ‌ర‌స్‌' పాట‌కు జాక్ మా స్టెప్పులేసి త‌న ఉద్యోగుల‌ను అల‌రించారు. అంతేగాకుండా చివ‌ర్లో స్టేజీ మీద బైక్‌తో విన్యాసాలు కూడా చేశారు.

గతంలోనూ ఇలాగే..

గతంలోనూ ఇలాగే..

గ‌తంలో అలీబాబా కంపెనీ 10వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా కూడా జాక్ మా త‌న గొంతు స‌వ‌రించుకుని, పాట పాడారు. నాట‌కాలు, క‌ళ‌ల మీద ఆస‌క్తి ఉన్న జాక్ మా.. అలీబాబా కంపెనీ స్థాపించ‌డానికి ముందు కూడా కొన్ని ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు.

హోరెత్తించారు..

హోరెత్తించారు..

కాగా, తాజాగా జాక్ మా ఇచ్చిన డ్యాన్స్ షో మాత్రం ఉద్యోగులను హోరెత్తించింది. వేదికపై స్టెప్పులేస్తూ ఉద్యోగాలను ఉత్సాహపరిచారు జాక్ మా. ఆయనతోపాటు పలువురు కంపెనీ ప్రతినిధులు కూడా కాలు కదపడం గమనార్హం.

అవమానాల నుంచి ఫోర్బ్స్ కవర్ పేజీ వరకు..

జాక్ మా జీవితాన్ని గమనించినట్లయితే ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొని ఆయన ఈ స్థాయికి ఎదిగారు. ఉద్యోగం కోసం ప్రముఖ కంపెనీలకు వెళితే ఎక్కడా ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ఆయనే స్వయంగా ఓ కంపెనీని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ‘అలీబాబా'ను స్థాపించిన జాక్ మా.. ఇప్పుడు ఏకంగా ఫోర్బ్స్ మేగజైన్ కవర్ పేజీకి ఎక్కారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chinese firm Alibaba celebrated its 18th anniversary recently and it was company's founder who stole the show. Jack Ma, a billionaire and one of the most celebrated entrepreneur in the world right now, danced like Michael Jackson.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి