వారసురాలికి కిమ్ స్పెషల్ ట్రైనింగ్.. యుద్ధ ట్యాంకుపై తండ్రీకూతుళ్ల రచ్చ!
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ఆయన తన గారాల పట్టి కిమ్ జు ఏతో కలిసి దేశం సరికొత్తగా అభివృద్ధి చేసిన యుద్ధ ట్యాంకును స్వయంగా నడుపుతూ కనిపించారు. గురువారం జరిగిన భారీ స్థాయి సైనిక విన్యాసాల్లో తండ్రీ కూతుళ్లిద్దరూ ఒకే రకమైన లెదర్ జాకెట్లు ధరించి యుద్ధ ట్యాంకుపై కనిపించడం విశేషం.
ట్యాంకుపై కిమ్.. హాచ్ నుంచి జు ఏ!
స్థానిక మీడియా విడుదల చేసిన ఫోటోల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ తన ట్రేడ్‌మార్క్ లెదర్ జాకెట్ ధరించి యుద్ధ ట్యాంకుపై కూర్చొని ఉండగా.. ఆయన కుమార్తె జు ఏ ట్యాంకు లోపలి నుంచి తల బయటపెట్టి ఉత్సాహంగా కనిపిస్తోంది. ప్యాంగ్యాంగ్ ట్రైనింగ్ బేస్ నంబర్ 60 వద్ద జరిగిన ఈ విన్యాసాల్లో క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కొనే అత్యాధునిక రక్షణ వ్యవస్థ కలిగిన ట్యాంకులను ప్రదర్శించారు.

వారసురాలిగా స్థిరపడిందా?
గత కొన్ని నెలలుగా కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెను దాదాపు అన్ని కీలక సైనిక కార్యక్రమాలకు వెంటబెట్టుకొని వెళ్తున్నారు. గత వారం కిమ్ కూతురు పిస్టల్‌తో కాల్పులు జరుపుతున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా యుద్ధ ట్యాంకు పరీక్షల్లో కిమ్ జు ఏ పాలుపంచుకోవడం చూస్తుంటే.. కిమ్ తన తర్వాతి వారసురాలిగా ఆమెను సిద్ధం చేస్తున్నారని దక్షిణ కొరియా నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సైనిక పటిమపై కిమ్ జోంగ్ ఉన్ సంతృప్తి
"మన సైన్యం ధైర్యసాహసాలకు ఈ యుద్ధ ట్యాంకుల కవాతు నిదర్శనం" అని కిమ్ జోంగ్ ఉన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాలకు ప్రతిచర్యగా ఉత్తర కొరియా ఈ ప్రదర్శన చేపట్టినట్లు తెలుస్తోంది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications