వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంహెచ్ 370: ఘటన జరిగిన ఏడాదికి.. ముందు రోజు నివేదిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: గత ఏడాది మార్చి 8వ తేదీన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370 గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఏడాదికి ఒక్కరోజు ముందు దీని పైన నివేదికలు వెలువడనున్నాయి. ఈ విషయమై మలేషియా దేశ ఉప రవాణా శాఖ మంత్రి అబ్దుల్ అజీజ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు.

ఎంహెచ్ 370 విమాన ప్రమాదం 2014 మార్చి 8న జరిగిందని, ఈ ఘటన పైన మార్చి 7వ తేదీన నివేదికలు వెల్లడవుతాయని మంత్రి చెప్పారు. దీని పైన నివేదిక చాలా పెద్దగా ఉందని ఇన్వెస్టిగేషన్ టీం చెప్పిందని, ఈ నివేదిక వందలాది పేజీలు ఉంటుందని చెప్పారు. ఎంహెచ్ 370 ప్రమాదంలో చనిపోయిన 239 మందిలో భారతీయులు ఐదుగురు.

కాగా, చైనా రాజధాని బీజింగ్‌కు వెళ్తూ మార్చి 8, 2014న మలేషియా విమానం ఎంహెచ్-370 ఆచూకీ గల్లైంతన విషయం తెలిసిందే. దీని ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఈ విమాన శకలాలు హిందూ మహాసముద్రంలో కనిపించాయని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు స్పష్టంగా ఆచూకీ తెలియరాలేదు.

Malaysia to Release MH370 Report One Day Before Anniversary

ఇటీవల ఎయిర్ ఏషియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అంతకుముందు ఎంహెచ్ 370 గల్లంతైనప్పుడు ఎయిర్ ఏషియా ఓ ప్రకటన చేసింది. అది ఇటీవల ఎయిర్ ఏషియా కూలినప్పుడు చర్చనీయాంశమైంది.

మార్చిలో ఎంహెచ్ 370 విమానం గల్లంతైంది. ఆ తర్వాత నెలలో అంటే ఆ విమానం గల్లంతైన ఆరు వారాల తర్వాత ఎయిర్ ఏషియా ఓ ప్రకటన చేసింది. తమ పైలట్ ప్రయాణీకులను సురక్షితంగా తీసుకు వస్తాడని, తమ విమానాల్లో ప్రయాణించే వారు ఎటువంటి భయం చెందవలసిన అవసరం లేదని దాని సారాంశం. ఆ ప్రకటన చేసిన ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలింది.

అయితే, అలాంటి సమయంలో ఎయిర్ ఏషియా ప్రకటన పైన విమర్శలు వచ్చాయి. ఎయిర్ ఏషియా కూడా దాని పైన ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. తాము ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నామని ఎయిర్ ఏషియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాతుక్ మెరనన్ ఆ తర్వాత చెప్పారు.

English summary
Malaysia will release an interim report on its investigation into Flight MH370 on March 7, a day before the first anniversary of the jet's mysterious disappearance, an official said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X