టేకాఫ్‌కు రెడీ అయిన ఫ్లైట్.. విమానం రెక్కపైకి ఎక్కి షాకిచ్చిన దుండగుడు (వీడియో)
నైజీరియాలో ఓ వ్యక్తి విమాన ప్రయాణీకులకు షాక్ ఇచ్చాడు. టేకాఫ్‌కు సిద్ధమైన విమానం రెక్కపైకి ఎక్కి నిలబడ్డాడు. దీంతో విమాన సిబ్బందితో పాటు ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
జులై 19న నైజీరియా ఐకెజాలోని ముర్తలా ముహమ్మద్ ఎయిర్‌పోర్ట్‌లో అజ్మన్ ఎయిర్ ఫ్లైట్ టేకాఫ్‌కు సిద్ధమైంది. ఇంతలో రన్ వే పక్కనే ఉన్న పొదల నుంచి ఓ వ్యక్తి అకస్మాత్తుగా విమానం వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అది గమనించిన పైలెట్ విమాన ఇంజన్ నిలిపివేశాడు. ఇంతలో విమానం పైకి ఎక్కిన ఆ దుండగుడు వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను ఫ్లైట్ ఇంజన్ పైన పెట్టి విమానం రెక్కపైకి ఎక్కి నిలబడ్డాడు. అది గమనించిన విమాన సిబ్బందితో పాటు ప్యాసింజర్లు షాక్‌కు గురయ్యారు. ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోయారు.

దుండగుడు ఫ్లైట్ పైకి ఎక్కి నిలబడటంతో దాదాపు 30 నిమిషాల పాటు హైడ్రామా కొనసాగింది. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రయాణీకులు భయపడిపోవడంతో వారందరినీ విమానం నుంచి దింపేశారు. తర్వాతి విమానంలో వారిని గమ్యస్థానాలకు చేర్చారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications