ఘోర ప్రమాదం: కులిన మిలటరీ విమానం, 257మందికిపైగా మృతి

Subscribe to Oneindia Telugu

అల్జీర్స్: అల్జీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని అర్జీర్స్‌లో విమానాశ్రయం సమీపంలో మిలిటరీకి చెందిన ఓ విమానం కూలింది. ఈ ప్రమాదంలో సుమారు 257మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ప్రమాదానికి గురైన విమానంలో మొత్తం 247మంది ప్రయాణికులు, 10మంది విమాన సిబ్బంది ఉన్నారు.

బౌఫరిక్ విమానాశ్రయానికి సమీపంలో విమానం కూలిపోయిందని స్థానిక మీడియా కథనాలు వెలువరించింది. విమానం క్రాష్ ల్యాండింగ్ అవడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికి ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

More Than 100 Killed In Military Plane Crash In Algeria: Reports

బౌఫారిక్ విమానాశ్రయం నుంచి బెచార్ వెళ్లుండగా విమానానికి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం కూలడంతో ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. సమాచారం అందుకున్న భద్రతా దళాలు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Algerian military plane crashed near an airport outside the capital Algiers, killing several people on Wednesday, local media and a witness said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి