Imran Khan : ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో ఉగ్రవాదులు దొరకలేదు కానీ..

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను టార్గెట్ చేసే పనిలో అక్కడి షెబాజ్ షరీఫ్ ప్రభుత్వంతో పాటు ఆర్మీ కూడా పోటీ పడుతున్నాయి. పోలీసులు తాజాగా ఆయన్ను ఓ కేసులో అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్లగా..అక్కడ ఆర్మీ దళాలు చేరుకుని బలవతంగా అరెస్టు చేసి తీసుకెళ్లిపోయాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో ఆయన విడుదలయ్యారు. అనంతరం ఇమ్రాన్ ఇళ్లలో తీవ్రవాదులు దాక్కున్నట్లు పాక్ ప్రభుత్వం ఆరోపించింది.

ఇమ్రాన్ ఇళ్లలో తీవ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపు 30 నుంచి 40 మంది తీవ్రవాదులు ఇమ్రాన్ ఇంట్లో దాక్కున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోదాలు కొనసాగించిన పోలీసులకు అక్కడ ఎవరూ దొరకలేదు. దీంతో వారు మౌనంగా వెనుదిరగాల్సిన పరిస్ధితి ఎదురైంది. దీనిపై ఇమ్రాన్ ఖాన్ ఇంటి భద్రతా వ్యవహారాలు చూస్తున్న సిబ్బంది వ్యంగంగా స్పందించారు.

 imran-khan-pak

ఇమ్రాన్‌ఖాన్‌ జమాన్‌ పార్క్‌ నివాసానికి వెళ్లి అక్కడ దాక్కున్న 'ఉగ్రవాదులను' అరెస్టు చేసేందుకు సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన పంజాబ్‌ పోలీసులు కేవలం నీరు, బిస్కెట్‌లతో తిరిగి వచ్చారని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ తెలిపారు. లాహోర్ కమీషనర్ ముహమ్మద్ అలీ రంధవా, లాహోర్ డిప్యూటీ కమిషనర్ రఫియా హైదర్, డిఐజి ఆపరేషన్స్ సాదిక్ డోగర్, ఎస్ ఎస్పీ ఆపరేషన్స్ సోహైబ్‌లతో కూడిన ప్రతినిధి బృందం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఛైర్మన్ ఖాన్‌తో చర్చలు జరపడానికి ముందుగా ఆయనతో చర్చించినట్లు స్ధానిక డాన్ వార్తాపత్రిక తెలిపింది.

ఇమ్రాన్ ఖాన్ నివాసంలో సోదాలు నిర్వహించడానికి పంజాబ్ పోలీసులు వారెంట్లు పొందిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో ఇమ్రాన్ నివాసం యొక్క ప్రవేశ మరియు నిష్క్రమణ పాయింట్లు రెండింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తామని, ఆ ప్రదేశంలో దాగి ఉన్న "ఉగ్రవాదులను" కనుగొనడం ప్రాథమిక లక్ష్యం అని ఈ సందర్భంగా పంజాబ్ పోలీసుల ప్రకటన చేసినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. అయితే, పంజాబ్ పోలీసులు జమాన్ పార్క్ నుండి "ఖాళీ చేతులతో" తిరిగి వచ్చారని ఖాన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇఫ్తికార్ ఘుమాన్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+