Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nobel prize: నోబెల్ ప్రైజ్ పై తేల్చేసిన కమిటీ..! ట్రంప్-మచాడో డ్రామాపై.!

ప్రపంచవ్యాప్తంగా మానవ జాతికి గొప్ప ప్రయోజనం అందించేందుకు పనిచేసే వారికి ఏటా వివిధ రంగాల్లో ప్రదానం చేసే నోబెల్ అవార్డులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నోబెల్ అవార్డు అందుకున్న వారికీ అంతే గుర్తింపూ ఉంటుంది. అలాంటి నోబెల్ బహుమతిని అపహాస్యం చేసేలా తాజాగా వెనెజులా ప్రతిపక్ష నాయకురాలు మచాడో.. తనకు ఇచ్చిన ప్రైజ్ ను తీసుకెళ్లి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెప్పు కోసం ఆయనకు తిరిగి ప్రదానం చేయడం తీవ్ర వివాదాస్పదమైంది.

ఈ నేపథ్యంలో నార్వేకు చెందిన నోబెల్ అవార్డుల ఫౌండేషన్ మరోసారి ఈ డ్రామాపై స్పందించింది. నోబెల్ ఫౌండేషన్ యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి నోబెల్ బహుమతుల గౌరవాన్ని మరియు వాటి పరిపాలనను కాపాడటం అని తేల్చిచెప్పింది. ఫౌండేషన్ ఆల్ఫ్రెడ్ నోబెల్ సంకల్పాన్ని మరియు దాని నిబంధనలను సమర్థిస్తుందని వెల్లడించింది. మానవజాతికి గొప్ప ప్రయోజనాన్ని అందించిన వారికి ఈ బహుమతులు ప్రదానం చేయబడతాయని తెలిపింది.

Nobel Foundation Clarifies Prize Cannot Be Passed On or Further Distributed amid machado episode

అలాగే ప్రతీ నోబెల్ బహుమతిని ప్రదానం చేసే హక్కు ఎవరికి ఉందో అది నిర్దేశిస్తుందని ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. అందువల్ల ఒక బహుమతిని, ఊహకు కూడా మరెవరికీ బదిలీ చేయలేము లేదా పునఃప్రదానం కూడా చేయలేమని తేల్చిచెప్పేసింది. తద్వారా ట్రంప్-మచాడో ఎపిసోడ్ ను పరోక్షంగా తప్పుబట్టింది. ఇప్పటికే ట్రంప్ కు తన నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చేసిన మచాడోపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నార్వేతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, నగరాల్లో జనం ఈ చర్యపై మండిపడుతున్నారు. ఇంటర్నెట్ లోనూ నెటిజన్లు వీరిద్దరిపై దుమ్మెత్తిపోస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+