వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోషల్‌మీడియాతో నిద్ర సమస్యలు: కెనడా శాస్త్రవేత్తల హెచ్చరిక

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్: సోషల్ మీడియాలో గంటల కొద్ది గడిపేవారికి ఇబ్బందులు తప్పవని శాస్త్రవేత్తలను హెచ్చరించారు. కనీసం ఒక గంట పాటు సోషల్ మీడియాలో గడిపినా నిద్ర ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా సైట్స్‌లో గంటల కొద్దీ గడిపేవారిని పరిశోధకులు హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో రోజుకు కేవలం ఒక గంట పాటు విహరించినా నిద్ర ప్రక్రియకు విఘాతం కలుగుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది.

One hour a day on social media can derail your sleeping pattern, a new study warns.

రోజుకు 60 నిమిషాల పాటు వాట్సాప్‌, ఎఫ్‌బీ, స్నాప్‌చాట్‌లతో గడిపేవారు ఇలాంటి వాటికి దూరంగా ఉన్నవారితో పోలిస్తే నిద్ర సమస్యలతో అధికంగా బాధపడుతున్నట్టు ఈ పరిశోధనలో వెల్లడైందని పరిశోధకులు తెలిపారు.

ఎక్కువ సమయం యాప్స్‌, సైట్స్‌పై తో గడిపిన వారికి ఆ మేరకు నిద్ర తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా టీనేజ్‌ యువతులు ఎక్కువగా సోషల్‌ మీడియాకు అడిక్ట్‌ అవుతున్నారని అథ్యయనంలో తేలింది.

సోషల్‌ మీడియా వేగంగా విస్తరిస్తున్న క్రమంలో పిల్లలు, టీనేజర్లు న్యూ టెక్నాలజీకి అలవాటుపడి వారు యుక్తవయసుకు రాగానే వాటికి బానిసలవుతూ చెడు అలవాట్లకు లోనవుతున్నారని కెనడా పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.

English summary
One hour a day on social media can derail your sleeping pattern, a new study warns.The report by Canadian researchers was commissioned to assess why so many young people struggle to sleep eight hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X