అక్క సెక్సీ వీడియోలు పంపేవారు, చంపేశా: పాక్ మోడల్ సోదరుడు

Posted By:
Subscribe to Oneindia Telugu

లాహోర్: పాకిస్తాన్ హాట్ మోడల్, నటి కండీల్ బలోచ్‌ను హత్య చేసిన ఆమె సోదరుడు వసీమ్ మరోసారి దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశాడు. నేను నా సోదరిని చంపినందుకు జనాలు నన్ను గుర్తుంచుకుంటారని, అందుకు తాను గర్విస్తున్నానని చెప్పాడు.

అక్క పరువు తీసింది, తెలియకుండా చంపేశా: పాక్ మోడల్ సోదరుడి అరెస్ట్

మోడలింగ్ పేరుతో అసభ్యకర ఫోటోలు, వీడియోలతో తమ కుటుంబం పరువును బజారుకు ఈడ్చిందని, అందుకే తాను చంపేశానని వసీమ్ తప్పును అంగీకరించాడు. ఆమెకు డ్రగ్ ఇచ్చి, ఆ తర్వాత గొంతు నులిమి చంపినట్లు ఇంతకుముందే వెల్లడించాడు.

'People will remember me with

మరోసారి తన సోదరిని చంపిన అంశంపై స్పందించాడు. ఆమెను చంపినందుకు తాను ఏమీ బాధపడటం లేదన్నాడు. ఆమె మా కుటుంబానికి చాలా చెడ్డపేరు తెచ్చిందన్నాడు. తాను మాదక ద్రవ్యాలకు బానిసను అయినా, స్పృహలో ఉండే హత్య చేశానని చెప్పాడు.

మోడీ నుంచి నేర్చుకో: మోడల్ హత్యపై షరీఫ్‌కు రాఖీ సావంత్, ట్విస్ట్

అమ్మాయిలు జన్మించేది ఇంట్లో ఉండేందుకని, వారు సంప్రదాయాలను పాటించటాలని, అయితే తన సోదరి ఎప్పుడూ అలా పాటించలేదని చెప్పాడు. హత్య చేశానని గర్వంగా అంగీకరిస్తున్నానని చెప్పాడు. ఆమెను చంపడం ద్వారా నేను నా తల్లిదండ్రులకు, సోదరుడికి ఉపశమనం కలగించానని చెప్పాడు.

గత రెండు దశాబ్దాలుగా ఆమె వల్ల తన కుటుంబం బాధపడుతోందన్నాడు. తన సోదరికి చెందిన సెక్సీ ఫోటోలను, వీడియోలను తన స్నేహితులు తనకు పంపించేవారని చెప్పాడు. తన స్నేహితులు మొబైల్ మార్కెట్లో ఉన్నారని, వీరు ఎప్పుడు తనకు వాటిని పంపించేవారని చెప్పాడు. ఆత్మహత్య కంటే హత్య మేలని భావించానని, అందుకే నేను చావకుండా ఆమెను చంపేశానని చెప్పాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Confessing to his crime, Pakistan's internet sensation and model Qandeel Baloch's brother who was arrested for drugging and strangling her said he is "not embarrassed" to have killed her as she brought disrepute to the family.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి