Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..!
ఇరాన్ యుద్దం ఆపాలంటూ పోప్ లియో 14 (pope leo xiv) ఇస్తున్న పిలుపులకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ఆయనపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. వీటిపై ఇవాళ అల్జీరియాకు వెళ్తూ విమానంలో ఇంటర్వ్యూ ఇచ్చిన పోప్ లియో.. ఘాటు వ్యాఖ్యలు చేసారు. తాను ట్రంప్ తో చర్చకు దిగాలనుకోవడం లేదని, కొంత మందిలా క్రైస్తవ సందేశాన్ని దుర్వినియోగం చేయడానికి యుద్దాన్ని వాడుకోనని తేల్చిచెప్పేశారు. ఇరాన్ తో చర్చల వేళ ట్రంప్ తాను క్రైస్తవ సందేశం ప్రకారమే పనిచేస్తున్నట్లు చెప్పుకోవడాన్ని పోప్ తప్పుబట్టారు. ప్రపంచ నాయకులను యుద్ధోన్మాదాన్ని వీడాలని కోరారు.
యుద్ధాన్ని సమర్థించుకోవడానికి మతపరమైన భాషను ఉపయోగించడాన్ని పోప్ ఖండించారు. మన చుట్టూ ఉన్న సర్వశక్తిమంతులమనే భ్రమ రోజురోజుకు అనూహ్యంగా మారుతోందని పోప్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ట్రంప్.. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేశారు. అమెరికాకే చెందిన పోప్ లియోను నేరాల విషయంలో బలహీనుడిగా, విదేశాంగ విధానంలో ఘోరమైనవాడిగా అభివర్ణించారు. ట్రంప్ ప్రభుత్వంపై ఉన్న భయం గురించే పోప్ మాట్లాడతారని,కానీ కోవిడ్ సమయంలో క్యాథలిక్ చర్చి, ఇతర క్రైస్తవ సంస్థలు ఎదుర్కొన్న భయం గురించి మాత్రం ప్రస్తావించరన్నారు. ఆ సమయంలో, చర్చి ప్రార్థనలు నిర్వహించినందుకు, బయటకు వెళ్లి పది, ఇరవై అడుగుల దూరంలో ఉన్నప్పటికీ, పూజారులను, మంత్రులను, ప్రతి ఒక్కరినీ అరెస్టు చేశారన్నారు.

అమెరికా విధానాలను విమర్శించే పోప్ తనకు వద్దని, కేవలం అమెరికా అధ్యక్షుడి వల్లే లియో చర్చి నాయకుడిగా నియమితులయ్యారని ట్రంప్ అన్నారు. తాను వైట్ హౌస్‌లో లేకపోతే, లియో వాటికన్‌లో ఉండేవారు కాదన్నారు. దురదృష్టవశాత్తు, నేరాల విషయంలో లియో బలహీనంగా ఉండటం, అణ్వాయుధాల విషయంలో బలహీనంగా ఉండటం తనకు నచ్చడం లేదన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై క్యాథలిక్కులు మండిపడ్డారు. పోప్ లియో ఆయనకు ప్రత్యర్థి కాదని, రాజకీయ నాయకుడూ కాదని, ఆయన క్రీస్తు ప్రతినిధి, సువార్త సత్యం నుంచి ఆత్మల సంరక్షణ కోసం మాట్లాడతారన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇవాళ పోప్.. తాను యుద్ధానికి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పుతూనే ఉంటానన్నారు. శాంతిని ప్రోత్సహించడానికి, సమస్యలకు న్యాయమైన పరిష్కారాలను కనుగొనడానికి దేశాల మధ్య చర్చలు, బహుపాక్షిక సంబంధాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తానన్నారు. నేటి ప్రపంచంలో చాలా మంది ప్రజలు బాధపడుతున్నారని, దీనికి ఒక మంచి మార్గం ఉందని చెప్పడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలని భావిస్తున్నట్లు తెలిపారు. తన పాత్రను తాను రాజకీయమైనదిగా చూడటం లేదని స్పష్టం చేశారు.
-
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
Hormuz Showdown: హార్ముజ్ లోనే తాడోపేడో..! అమెరికా-ఇరాన్ లో గెలిచేదెవరు ? -
కిలో బియ్యం రూ.600 - రూ.800.. కేజీ మాంసం రూ. 4000 పైనే !!! -
అమెరికా అధ్యక్షుడిగా ఇంతకంటే గర్వపడలేను -
యుద్ధంలోకి అమెరికా నేవీ.. హార్మూజ్ జలసంధి అష్టదిగ్బంధనం.. ట్రంప్ సంచలన వార్నింగ్ -
ఇరాన్ తో చర్చల వేళ.. రష్యాకు బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్.. -
అమెరికా సైన్యాన్ని హార్మూజ్ సుడిగుండాల్లో కప్పెట్టేస్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
US-Iran Talks: అమెరికాతో చర్చల్లో ఇరాన్ కు తొలి విజయం..! బంపర్ ఆఫర్..! -
Hormuz: హార్ముజ్ లో సీమైన్స్ కనిపెట్టలేం..! చర్చల వేళ బాంబుపేల్చిన ఇరాన్..! -
అమెరికాకు అనూహ్య షాక్..! చర్చల కోసం ఇరాన్ 4 షరతులు..! -
హర్మూజ్ ను దాటిన అమెరికా యుద్ధనౌకలు.. ఇదే తొలిసారి..! -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..!













Click it and Unblock the Notifications