• search

పాపం ఉత్తరకొరియా! అమెరికాకు లొంగి బతకాలా, ఆత్మరక్షణ నేరమా, చరిత్ర ఏం చెబుతోంది?

By Ramesh Babu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్యాంగ్ యాంగ్: ఉత్తరకొరియా-అమెరికా మధ్య నెలకొన్న పరిస్థితి చూస్తుంటే.. ఏ క్షణంలోనైనా అమెరికా దానిపై పూర్తిస్థాయి యుద్ధానికి పూనుకునే ప్రమాదం కనిపిస్తోంది. ఆఫ్ఘానిస్తాన్, ఇరాక్, లిబియాలను నాశనం చేసినట్లు ఉత్తర కొరియాను కూడా సర్వనాశనం చేయడానికి అమెరికా పూనుకుంటే ఉత్తర కొరియా చేతులు ముడుచుకొని కూర్చోవాలా?

  తెగించిన ఉత్తరకొరియా! మళ్లీ క్షిపణి పరీక్షకు సన్నాహాలు? ట్రంప్ పర్యటనపై కసితోనే?

  అమెరికా ఫస్ట్‌ లేడీ.. చుట్టూ ఆడ పోలీసులు.. జపాన్ పర్యటనలో ప్రత్యేక రక్షణ!

  అసలు ఉత్తరకొరియా ఎప్పుడైనా.. ఏ దేశంమీదైనా దాడికి పాల్పడిందా? చరిత్ర తరచి చూస్తే తెలుస్తుంది. అసలు ఏ దేశమైనా అమెరికాకు ఎందుకు లొంగి ఉండాలి? ఆత్మరక్షణ కోసం ఆయుధాలు తయారుచేసి పెట్టుకోవడం నేరమా? ప్రపంచంలోని ఇతర దేశాలు ఆయుధాలు తయారు చేసుకోవడం లేదా? మరి, ఉత్తరకొరియాపైనే అంత కక్ష ఎందుకు?

   అంతా తప్పుడు ప్రచారమే...

  అంతా తప్పుడు ప్రచారమే...

  చాలా కాలంగా ఉత్తరకొరియా గురించి, ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి చాలా రకాలుగా ప్రచారం జరుగుతోంది. ఉత్తరకొరియా అణ్వాయుధాలు తయారుచేసి అమెరికా మీద యుద్ధానికి కాలుదువ్వుతోందని, అసలు ఆ దేశం వల్ల ప్రపంచ శాంతికి, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ముంచుకొస్తోందని, జర్మనీ హిట్లర్, ఇటలీ ముస్సోలినీ మాదిరిగా కిమ్ జాంగ్ ఉన్ కూడా ఒక క్రూరమైన నియంత అని, ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోడని, ఆ దేశంలో ప్రజల జీవితం భయంకరంగా ఉంటుందని, తనకు ఎదురుతిరిగిన వారిని అంతమొందిస్తాడని.. ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది? ఇందులో నిజం ఎంత?

   ఉద్రిక్తతలకు అమెరికానే కారణం...

  ఉద్రిక్తతలకు అమెరికానే కారణం...

  అసలు కొరియా రెండు దేశాలుగా విడిపోవడానికి, కొరియా ద్వీపకల్పంలో ఏళ్లతరబడి చోటుచేసుకున్న యుద్ధ ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొరియా జపాన్ కు వలసదేశంగా ఉండేది. యుద్ధంలో జర్మనీ, ఇటలీలతో పాటుగా జపాన్ కూడా ఓడిపోయిన తరువాత, జపాన్ వలస దేశంగా ఉన్న కొరియా స్వతంత్ర దేశంగా మారింది. అప్పుడే ‘జపాన్ సేనలను నిరాయుధం' చేసే పేరుతో అమెరికా సేనలు కొరియా ద్వీపకల్పంలో దక్షిణాన 38 డిగ్రీల అక్షాంశరేఖ వద్దగల భూభాగాన్ని ఆక్రమించుకొని అక్కడ్నించి తన సేనలను ఉపసంహరించేందుకు నిరాకరించింది. అలాంటి అనివార్య పరిస్తితుల్లో ఉత్తర భూభాగంలో ఒక దేశంగా ఉత్తర కొరియా ఏర్పడింది. దక్షణ కొరియా ప్రాంతంలో అమెరికా తన తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని.. నాటినుంచీ రెండు సోదర కొరియన్ దేశాల మధ్య వైషమ్యాలను, యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ వస్తోంది. ఇదీ అసలు జరిగింది.

   కలవాలని ప్రజలు.. కలవనివ్వని అమెరికా...

  కలవాలని ప్రజలు.. కలవనివ్వని అమెరికా...

  అయితే కొరియా ద్వీపవాసులు మాత్రం రెండు కొరియాలు ఒకే దేశంగా ఏర్పడాలని కోరుకుంటున్నారు. కానీ మధ్యలో అమెరికా ససేమిరా అంటోంది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ప్రజాస్వామ్యయుతంగా ద్వైపాక్షిక చర్చలు జరుగకుండా ఇంతకాలం అమెరికానే అడ్డుపడుతూ వస్తోంది. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఈ మధ్యనే ఎన్నికైన మూన్ జే ఇన్ కూడా ఉత్తర కొరియాతో సంప్రదింపుల విధానానికి అనుకూలం అని ప్రజలకు హామీ ఇచ్చే అధికారంలోకి రాగలిగాడు. మరోవైపు దక్షణ కొరియా ప్రజలు కూడా అమెరికాను వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు కారణం.. అక్కడ అమెరికా టర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్(థాడ్) అని పిలిచే అత్యంత శక్తిమంతమైన ఆధునిక క్షిపణి కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే.

   ఆయుధాలైనా.. ఆత్మ రక్షణ కోసమే...

  ఆయుధాలైనా.. ఆత్మ రక్షణ కోసమే...

  1948లో ఉత్తర కొరియా ఒక సోషలిస్టు దేశంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశం ఇతర ఏ దేశంపైనైనా దాడి చేసిందా? యుద్ధాలకు పాల్పడిందా? లేదు.. ఎందుకంటే, సోషలిజంలో ఉత్పత్తి ప్రజల అవసరాలను తీర్చడానికి జరుగుతుంది. సోషలిస్టు దేశాలకు ఇతర దేశాల మార్కెట్లను కొల్లగొట్టాల్సిన అవసరంగానీ, దానికోసం యుద్ధాలకు, దాడులకు దిగవలసిన కోరిక గానీ ఉండదు. సోషలిస్టు దేశాల్లో మిలటరీని బలోపేతం చేసినా, ఆయుధాలు తయారు చేసుకున్నా అవి ఆ దేశ రక్షణ కోసమే తప్ప ఇతర దేశాలపై బలప్రయోగం చేయడానికి కాదు.

   యుద్ధాలు, దాడులు అమెరికాకే అవసరం...

  యుద్ధాలు, దాడులు అమెరికాకే అవసరం...

  అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా.. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన నాటి నుంచి నేటి వరకు 70 యుద్ధాలకు పాల్పడింది. 37 దేశాల మీద దాడి చేసి దాదాపు 2 కోట్ల మంది ప్రజల మరణానికి కారణమైంది. అసలు అమెరికా బడా పెట్టుబడిదారీ-సామ్రాజ్యవాద దేశం. అక్కడ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది మిలటరీ మారణాయుధాలే. తాను తయారు చేసిన ఆయుధాలను ఇతర దేశాలకు అమ్ముకోవాలంటే ఇతర దేశాలకు ఆ అవసరం ఉండాలి కదా? అందుకని, అమెరికాకు యుద్ధాలు, దాడులు అవసరం. అమెరికా ఇప్పటి వరకు 1,054 సార్లు అణ్వాయుధాలను పరీక్షించింది. కొత్త, కొత్త అణ్వాయుధాలను తయారు చేయడానికి ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం 1.46 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది.

   అమెరికా స్వభావం ఏమిటంటే...

  అమెరికా స్వభావం ఏమిటంటే...

  అమెరికా కోరిక ఏమిటంటే.. ప్రపంచంలోని అన్ని దేశాలూ దానికి సలాం కొడుతూ, లొంగి ఉండాలి. ఏ దేశమైనా తనకు లొంగకుండా ఎదిరిస్తే అగ్రరాజ్యానికి ఇట్టే కోపం వచ్చేస్తుంది. తనకు సలాం కొట్టే దేశాలు అణ్వస్త్రాలు పోగేసుకున్నా పర్వాలేదుకానీ.. ఎదిరించే దేశానికి విమానం కూడా ఉండకూడదన్నది దాని క్రూరమైన ఆలోచన. అమెరికా అనుసరిస్తున్న ఈ ద్వంద నీతినే ఉత్తర కొరియా వ్యతిరేకించింది. ఏనాటికైనా అమెరికా వల్ల తనకు ముప్పు తప్పదని భావించి.. దేశ రక్షణకై అణ్వస్త్రాలు తయారుచేసుకొంటోంది. గతంలో అమెరికా.. ఆఫ్ఘానిస్తాన్, ఇరాక్, లిబియా దేశాల్లో ఏం చేసిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. అలా ఉత్తర కొరియాను కూడా సర్వనాశనం చేయడానికి అమెరికా పూనుకుంటే ఉత్తర కొరియన్లు చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అమెరికా దాష్టీకం నుంచి తమ దేశాన్ని రక్షించుకోవాలా? పాపం.. వాళ్లు చేస్తున్నదీ అదే!

  కిమ్ చెప్పిందేమిటి.. ట్రంప్ అన్నదేమిటి..

  కిమ్ చెప్పిందేమిటి.. ట్రంప్ అన్నదేమిటి..

  అందరూ నియంతగా భావించే ఉత్తరకొరియా అధినేత కిమ్ శాంతికాముకుడని చెప్పడానికి ఆయన అన్న మాటలే నిదర్శనం. ‘అందరికంటే ఎక్కువగా ఉత్తర కొరియా శాంతిని ప్రేమిస్తోంది.. మా దేశ ఉనికిని కాపాడుకోడానికి, కొరియా ద్వీపకల్పంలో శాంతిని, భద్రతను రక్షించుకోవడానికి మేం అణ్వాయుధాలతో సిద్ధంగా ఉన్నాం..'' అని కిమ్ జాంగ్ ప్రకటిస్తే.. అమెరికా అధ్యక్షుడు ఏమన్నారో తెలుసా? ఈ మధ్యనే జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ‘ప్రపంచం ఇంతవరకు చూడని ఫైర్ అండ్ ఫ్యూరీని (దగ్ధం చేసే కోపాన్ని) ఉత్తర కొరియా చూడవలసి వస్తుందని.. ఉత్తర కొరియాను నాశనం చేస్తాం..' అని బెదిరించాడు.

   కిమ్ జాంగ్ ఉన్.. నియంత అయితే...

  కిమ్ జాంగ్ ఉన్.. నియంత అయితే...

  ఒకవేళ ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంతగా, నిరంకుశంగా అప్రజాస్వామికంగా పరిపాలిస్తూ, ఆ దేశ ప్రజలు ఆకలితో అలమటించేటట్లు చేస్తూ, వారిని నానా బాధలకు గురిచేస్తుంటే ఆయన్ని అధ్యక్షుడిగా ఉంచాలో, తొలగించాలో ఆ దేశ ప్రజలే నిర్ణయిస్తారు. అక్కడ ఏ తరహా సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ ఉండాలో అక్కడి ప్రజలే తేల్చుకుంటారు. ఆ దేశం విషయంలో జోక్యం చేసుకోవడానికి అమెరికా ఎవరు? ఉత్తరకొరియాలో రిజిమ్ ఛేంజ్ గురించి మాట్లాడడానికి అమెరికాకు హక్కు ఉందా? అమెరికా వేలు పెట్టిన ఆఫ్ఘానిస్తాన్, ఇరాక్, లిబియా దేశాల్లో ఎలాంటి ‘ప్రజాస్వామ్యం' ఏర్పడిందో, ఏ విధమైన ‘రిజిమ్ ఛేంజ్' జరిగిందో అందరికీ తెలిసిందే. ఇక్కడ ఒక చిన్న విషయం.. ఒకవేళ మన దేశ పాలకులు అమెరికాకు నచ్చకపోతే వారి గుణగణాలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడానికి లేదా వారిని తొలగించడానికి లేదా భారతీయుల సంక్షేమం కోసం అంటూ అమెరికా మన దేశంపై దాడి చేయడానికి మనం అంగీకరిస్తామా?

  ఆత్మరక్షణ నేరమా?

  ఆత్మరక్షణ నేరమా?

  ప్రస్తుతం అమెరికాకు చెందిన 30 వేల సైనిక దళాలు దక్షణ కొరియాలో, 50 వేల సైనిక దళాలు జపాన్‌లోనూ మోహరించి ఉన్నాయి. అణ్వాయుధాలను నింపుకున్న అమెరికా యుద్ధనౌకలు దక్షణ చైనా సముద్రతీరంలో గస్తీ కాస్తున్నాయి. అంతేకాదు, అమెరికాకు చెందిన బీ-1బీ సూపర్ సోనిక్ బాంబర్స్ నిత్యం కొరియా ద్వీపకల్పంలో విహారం చేస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఉత్తర కొరియాపై అమెరికా పూర్తిస్థాయి యుద్ధానికి పూనుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఉత్తర కొరియా ఏ చేయాలి? తన ఆత్మరక్షణకు సిద్ధమవ్వాలా? లేదా? ఆయుధం పట్టాలా? లేదా?

   ఉత్తరకొరియాపై మీడియా దుష్ప్రచారం...

  ఉత్తరకొరియాపై మీడియా దుష్ప్రచారం...

  అమెరికా వంటి అగ్రరాజ్యంతో యుద్ధం అంటే మాటలా? సినిమాల్లో చూపినట్లు కత్తులు, బరిసెలు సరిపోతాయా? అమెరికా దాడిని ఎదుర్కోవాలంటే క్షిపణులు, అణ్వస్త్రాలు ఉండాలా? లేదా? మరి ఆత్మ రక్షణ కోసం వాటిని తయారుచేసుకోవడం నేరం ఎలా అవుతుంది? దీన్ని బట్టి చూస్తే.. యుద్ధాలకు కారణమెవరో, ప్రపంచ శాంతికి, ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్నదెవరో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దోపిడీ పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు అమ్ముడు పోయిన మీడియా వాస్తవ సత్యాలను దాచిపెట్టి ఉత్తర కొరియాపై, వ్యక్తిగతంగా ఆ దేశాధ్యక్షుడిపై కట్టుకథలతో పతాక శీర్షికల్లో దుష్ప్రచారం చేస్తోంది. పాపం.. ఉత్తరకొరియా!

  English summary
  The United States and its Asian allies regard North Korea as a grave security threat. It has one of the world’s largest conventional military forces, which, combined with its escalating missile and nuclear tests and aggressive rhetoric, has aroused concern worldwide. But world powers have been ineffective in slowing its path to acquire nuclear weapons. The North’s leader, Kim Jong-un, sees the nuclear program as the means to sustain his regime. While it remains among the poorest countries in the world, North Korea spends nearly a quarter of its GDP on its military, according to U.S. State Department estimates. Its brinkmanship will continue to test regional and international partnerships aimed at preserving stability and security.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more