Russia-Ukraine War : రష్యా-ఉక్రెయిన్ మిలటరీ సామర్ధ్యాలివే-ఎవరి సత్తా ఏంటి ?
రష్యా ఇవాళ ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించింది. కొంతకాలంగా ఉక్రెయిన్ ను ఆక్రమించేందుకు ఎత్తులు వేస్తున్న రష్యా ఇవాళ సైనిక చర్యకు దిగింది. దీంతో రష్యాను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రష్యా-ఉక్రెయిన్ సైనిక సామర్ధ్యాలేంటో ఓసారి తెలుసుకుందాం.
2022 సంవత్సరానికి ఉక్రెయిన్, రష్యాల సైన్యం, ఆయుధాల బలాన్ని పోల్చి చూస్తే రష్యా ఆధిపత్యం కనిపిస్తుంది. ముందుగా జనాభా పరంగా చూస్తే ఉక్రెయిన్ లో 4 కోట్ల 37 లక్షల మంది జనాభా ఉంటే రష్యాలో 14 కోట్ల 23 లక్షల మంది ఉన్నారు. ఉక్రెయిన్ లో యుద్ధానికి సన్నద్ధంగా ఉన్న జనాభా కోటీ 56 లక్షలు కాగా.. రష్యాలో 4 కోట్ల 66 లక్షలు. ఉక్రెయిన్ లో క్రియాశీలకంగా ఉన్న సైన్యం 2 లక్షలు కాగా. రష్యాలో 8.5 లక్షలుగా ఉంది. అదే సమయంలో రెండు దేశాలూ చెరో రెండున్నర లక్షల మందిని రిజర్వు సైన్యంగా ఉంచుకున్నాయి. ఉక్రెయిన్ కు 50 వేల మంది పారా మిలటరీ బలగాలు ఉండగా.. రష్యాకు రెండున్నర లక్షల మంది ఉన్నారు.

ఉక్రెయిన్ రక్షణ వ్యయం 11870 కోట్ల డాలర్లు కాగా.. రష్యాలో లక్షా 54 వేల కోట్లుగా ఉంది. ఉక్రెయిన్ వద్ద మొత్తం 318 మిలటరీ యుద్ధ విమానాలు ఉండగా..రష్యా వద్ద 4173 ఉన్నాయి. ఉక్రెయిన్ వద్ద 69 ఫైటర్ జెట్లు ఉండగా.. రష్యా వద్ద 772 ఉన్నాయి. కేవలం దాడులకే వాడే యుద్ధ విమానాలు ఉక్రెయిన్ వద్ద 29 ఉండగా.. రష్యా వద్ద 739 ఉన్నాయి. ఉక్రెయిన్ వద్ద 32 యుద్ధ రవాణా విమానాలు ఉండగా.. రష్యా వద్ద 445 ఉన్నాయి. ఉక్రెయిన్ వద్ద 71 యుద్ధ ట్యాంకర్లు ఉండగా.. రష్యా వద్ద 522 ఉన్నాయి. ఉక్రెయిన్ దగ్గర 5 ప్రత్యేక మిషన్లు ఉండగా.. రష్యా వద్ద 132 ఉన్నాయి. ఉక్రెయిన్ వద్ద 112 యుద్ధ హెలికాఫ్టర్లు ఉండగా.. రష్యా వద్ద 1543 ఉన్నాయి.

Recommended Video
ఉక్రెయిన్ వద్ద యుద్ధ ట్యాంకులు 2596 ఉండగా. రష్యా వద్ద అవి 12420 ఉన్నాయి. ఉక్రెయిన్ వద్ద సాయుధ వాహనాలు 12303 ఉండగా.. రష్యా వద్ద అవి 30122 ఉన్నాయి. నేరుగా ప్రయోగించే ఆయుధాలు ఉక్రెయిన్ వద్ద 1067 ఉండగా.. రష్యా వద్ద 6574 ఉన్నాయి. ఉక్రెయిన్ వద్ద 38 యుద్ధ ఓడలు ఉండగా... రష్యా వద్ద 605 ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ లను తరలించే ఓడ రష్యా వద్ద ఒకటి మాత్రమే ఉంది. ఉక్రెయినా్ లో 187 ఎయిర్ పోర్టులు ఉండగా.. రష్యాలో 1218 ఉన్నాయి. ఉక్రెయిన్ లో ఆరు పోర్ట్ టెర్మినల్స్ ఉండగా. రష్యా వద్ద 8 ఉన్నాయి.












Click it and Unblock the Notifications