అమెరికాలో మంచు తుఫాను బీభత్సం: వాషింగ్టన్‌లో విద్యుత్ నిలిపివేత

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికాలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఈశాన్య ప్రాంతంలోని సుమారు రెండు లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌, ఫిలడెల్ఫియా, బోస్టన్‌ తదితర ప్రాంతాల్లో పలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడుతోంది.

america

వర్జీనియా, మేరీలాండ్‌, మసాచుసెట్స్‌ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది.

వాషింగ్టన్‌ డీసీ నగరంలో వేలాది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వాషింగ్టన్‌ డీసీ, మేరీలాండ్‌, వర్జీనియాలతో పాటు పలు ప్రాంతాల్లో స్నో ఎమర్జెన్సీ ప్రకటించారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The north-eastern US states of New York, New Jersey, Pennsylvania and Virginia have declared states of emergency as a huge winter storm sweeps in, bringing heavy snow.
Please Wait while comments are loading...