Trump Impeachment : ట్రంప్‌కు రిపబ్లికన్ల షాక్‌- 10 మంది వ్యతిరేక ఓటు

అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికను ఆమోదించడానికి జరిగిన సమావేశం సందర్భంగా తన మద్దతుదారులను క్యాపిటల్‌ భవనంపైకి ఉసిగొల్పారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డొనాల్డ్‌ ట్రంప్‌ను ఎట్టకేలకు ఆభిసంసన ద్వారా సాగనంపారు. ట్రంప్ అభిశంసన వేళ సర్వప్రతినిధుల సభలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చోసుకున్నాయి.

క్యాపిటల్ భవనంపై దాడుల ద్వారా అమెరికా ప్రతిష్టను నాశనం చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై డొనాల్డ్‌ ట్రంప్‌ను సర్వప్రతినిధుల సభ బుధవారం అభిశంసిందింది. ట్రంప్‌ అభిశంసన కోసం సర్వప్రతినిధుల సభకు హాజరైన వారిలో ఓటింగ్‌ ప్రకారం 232-197 తేడాతో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. అయితే డెమోక్రాట్లు ఎలాగో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేయడం సహజమే అయినా ట్రంప్‌ సొంత పార్టీకి చెందిన వారు కూడా ఆయనకు షాకిచ్చారు.

These 10 House Republicans voted to impeach Trump on Wednesday

ట్రంప్‌ సొంత పార్టీ రిపబ్లికన్లకు చెందిన పది మంది ప్రతినిధులు ట్రంప్‌కు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానానికి మద్దతుగా ఓటు వేయడం విశేషం. అలాగే మరో ఐదుగురు రిపబ్లికన్లు ఈ అభిశంసన ప్రక్రియకు దూరంగా ఉండిపోయారు. దీంతో ట్రంప్‌కు దారుణ పరాభవం తప్పలేదు. అయితే సొంత పార్టీకి చెందిన వారు కూడా ట్రంప్‌కు మద్దతునివ్వకపోవడంతో ట్రంప్‌ పరిస్దితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.

ఇలా ట్రంప్‌ అభిశంసనకు మద్దతిచ్చి ఆయనకు షాకిచ్చిన వారిలో ఆడం కిన్జింగర్‌(ఇల్లినాయిస్‌), లిజ్‌ షెనీ (వయోమింగ్‌), జాన్‌ కటికో (న్యూయార్క్‌), ఫ్రెడ్‌ ఆప్టన్‌ ( మిషిగాన్‌), జైమే హెరీరా బ్యూట్లర్‌ (వాషింగ్టన్‌), పీటర్‌ మెయిజర్‌ (మిషిగాన్‌), ఆంటోనీ గొంజాలెజ్‌ (ఓహియో), టామ్‌ రైస్‌(సౌత్‌ కరోలినా), డేవిడ్‌ వాలడావో ( కాలిఫోర్నియా) ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+