ట్రంప్ ఎఫెక్ట్-కలవరం: గ్రీన్ కార్డ్ రాకుంటే వెనక్కి, తెలుగు వారికీ ఎక్కువ నష్టం

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్/న్యూఢిల్లీ: వీసాల జారీలో ఎలాంటి అనాలోచిత మార్పులు తీసుకు వచ్చినా భారత దేశంతో పాటు అమెరికాకు కూడా భారీ నష్టం జరిగే అవకాశం ఉందని నాస్కాం అధ్యక్షులు చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఇది భారత ఐటీ పరిశ్రమ సమస్య కాదని, హెచ్1బీ వీసాలపై వెళ్తున్న భారతీయులందరిపై ప్రభావం పడుతుందన్నారు.

ఇప్పటికే అమెరికాను నిపుణుల కొరత వేధిస్తోందని, ఇలాంటి ప్రతిపాదనలతో భారత్‌, అమెరికా రెండు దేశాలకూ నష్టమే అన్నారు. ఒకవేళ నిజంగా భారత నిపుణుల్ని వెనక్కు పంపిస్తే తాను స్వాగతం చెబుతానని, భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న సమయంలో చేయి అందించేందుకు మీరు వస్తున్నారని చెబుతానని మహీంద్ర గ్రూప్‌ అధిపతి ఆనంద్‌ మహీంద్ర అన్నారు.

భారత అమెరికన్లకు కంటిమీద కునుకు లేకుండా

భారత అమెరికన్లకు కంటిమీద కునుకు లేకుండా

అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో చాలామంది వెనక్కి తిరిగి వచ్చే సంకేతాలు కనబడుతున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ గ్రీన్ కార్డు దరఖాస్తు పెండింగులో ఉన్న విదేశీయులు హెచ్1బీ వీసాలు ఆటోమేటిక్‌గా రెన్యూవల్ అయ్యే విధానాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదనను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పరిశీలిస్తోంది. అంటే హెచ్1బీ వీసా పొడిగింపు ఆరేళ్లకు మించి ఉండబోదనే వార్త భారత అమెరికలన్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

కార్యకూపం దాలిస్తే

కార్యకూపం దాలిస్తే

డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే వారంతా మళ్లీ అందరితో పోటీపడి హెచ్1బీ వీసా దక్కించుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ కార్డ్ రాక, హెచ్1బీ లాటరీలో అదృష్టం దక్కక కనీసం లక్షల మంది భారతీయ ఉద్యోగులు ఎలాంటి వీసాలు లేని పరిస్థితుల్లో అమెరికా వదిలవలసి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అదే జరిగితే ఇదే ప్రథమం

అదే జరిగితే ఇదే ప్రథమం


అదే జరిగితే, అమెరికా చరిత్రలో ఇంత భారీ స్థాయిలో భారతీయ ఉద్యోగులను వెనక్కి పంపేయడం ఇదే ప్రథమం కాగలదు అంటున్నారు. వీసా పొడిగింపు అనేది మూడేళ్ల నుంచి ఆరేళ్ల కాలపరిమితి దాకానే ఉంటుందని, వారితో పాటు కుటుంబ సభ్యులు ఇంటి బాట పట్టాల్సిందేనని చెబుతున్నారు.

దేనిపైనా నిర్ణయం తీసుకోలేదు

దేనిపైనా నిర్ణయం తీసుకోలేదు

అమెరికా నుంచి వస్తే, వారు భారతీయ మార్కెట్లో ఉద్యోగాలు వెతుక్కుంటారు. అంటే భారత ఉద్యోగ మార్కెట్లోను అలజడి కనిపించే అవకాశముందని అంటున్నారు. ట్రంప్ సర్కారు బై అమెరికన్ - హైర్ అమెరికన్ ఆదేశాలను అమలు చేసేందుకు తగిన మార్గాలను అన్వేషిస్తోంది. అందుకు పలు అంశాలు పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు. అయితే దేనిపైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఐటీ ఉద్యోగులే ఎక్కువ, తెలుగువారే 30 శాతానికి పైగా

ఐటీ ఉద్యోగులే ఎక్కువ, తెలుగువారే 30 శాతానికి పైగా

గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నామని, అది పెండింగులో ఉన్నంత వరకు అమెరికాలో ఉండడానికి ఢోకా లేదన్న భారతీయుల ధీమాకు అమెరికా ప్రభుత్వం గండికొడుతోంది. అత్యదికంగా హెచ్1బీ వీసాలపై అమెరికాలో ఉంటున్న వారు ఐటీ ఉద్యోగులే. అందులోను 30 నుంచి 40 శాతం మంది తెలుగువారే. ఇప్పటికే ఇళ్లను కొని స్థిపపడిన సాఫ్టువేర్ ఉద్యోగులను తాజా ప్రతిపాదన ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గ్రీన్ కార్డు రాకుంటే స్వదేశానికి తిరుగుటపా తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అత్యధిక ప్రభావం మన వారిపైనే

అత్యధిక ప్రభావం మన వారిపైనే


దాదాపు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. తెలుగు రాష్ట్రాల వారు 40 వేల నుంచి 50 వేల మంది ఉన్నారు. వారిలో చదువు పూర్తయిన తర్వాత స్వదేశానికి వచ్చేవారు తక్కువ మంది. ఐటీ ఉద్యోగుల్లోనూ తెలుగు వారు ఎక్కువే ఉంటారని అంచనా. తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే కనీసం 5 లక్షల మంది భారత్‌కు తిరిగి రాక తప్పదని అంచనా వేస్తున్నారు.

కాగా, అమెరికాలో ఉద్యోగం చేసే భారతీయుల్లో దాదాపు ఎనభై శాతం మంది ఐటీ నిపుణులే. వారు తాత్కాలిక ఉద్యోగం చేసుకునేందుకు ఏటా అమెరికా ప్రభుత్వం 85 వేల హెచ్1బీ వీసాలు మంజూరు చేస్తుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్‌లో మొదలవుతోంది. ఆ వీసాల్లో 20 వేలను అమెరికాలో చదువుకున్న వారికి కేటాయిస్తారు. మిగతా వాటిని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులకు ఇస్తారు. మొత్తం వీసాల్లో 70 శాతం భారతీయులకు దక్కుతున్నాయి. ఆరేళ్లపాటు హెచ్1బీ వీసాపై ఉంటూ గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకొని అది తేలేవరకు అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నారు. అయితే వీసాల పొడిగింపులో హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం(డీహెచ్‌ఎస్‌) సవరణను ప్రతిపాదిస్తోంది. ట్రంప్‌ నినాదానికి అనుగుణంగా వీసాల జారీలో విధాన, నియంత్రణా పరమైన మార్పులను తాము పరిశీలిస్తున్నట్లు అమెరికా పౌరసత్వం, వలసల సేవల సంస్థ (యూఎస్‌ఐఎస్‌) మీడియా సంబంధాల విభాగం అధిపతి జొనాథన్‌ విథింగ్టన్‌ కూడా తెలిపారు. ఆరేళ్ల లోపు గ్రీన్‌కార్డు రాకుంటే ఇక అమెరికాలో ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఈ ప్రతిపాదనే భారతీయ ఉద్యోగుల్లో కల్లోలం రేపుతోంది. గ్రీన్‌కార్డు దక్కితే అక్కడే స్థిరపడవచ్చు. కాకపోతే ఓటు హక్కు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందటం కుదరదు. అవి కూడా దక్కాలంటే సిటిజన్‌షిప్‌ రావాలి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anand Mahindra, Chairman Mahindra Group, took Twitter to express his "welcome" message for "skilled" workers who may have to come back if the change in the H-1B rules is applied. He wrote: "If that happens, then I say 'Swagatam, Welcome Home.' You're coming back in time to help India Rise..."

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి