వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటమి ఒప్పుకోని ట్రంప్- బైడెన్‌ను అడ్డుకునేందుకు భారీ వ్యూహం- ఏం జరగబోతోంది ?

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడినప్పటికీ కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో మాత్రం ప్రతిష్టంభన వీడటం లేదు. మ్యాజిక్‌ మార్కు 270 దాటేసినప్పటికీ డెమోక్రాట్‌ అభ్యర్ధి జో బైడెన్‌ గెలుపును అంగీకరించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ సిద్దం కాకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఇప్పుడు ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్‌ ఎత్తుల్ని కొన్ని నెలల క్రితమే ఊహించిన బైడెన్‌.. ఫలితాల తర్వాత ఆయన తప్పుకోకపోతే సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి వస్తుందనే హెచ్చరికలు కూడా చేశారు. దీంతో ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యవహారం ఏ మలుపు తీసుకోబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది.

Recommended Video

US Election 2020 Results: Trump Wins Alaska, Joe Biden On Donald Trump

అమెరికా కొత్త అధ్యక్షుడిపై అదే ఉత్కంఠ- పని మెదలుపెట్టేసిన బైడెన్‌-ఐరోపా నేతలతో చర్చలు...అమెరికా కొత్త అధ్యక్షుడిపై అదే ఉత్కంఠ- పని మెదలుపెట్టేసిన బైడెన్‌-ఐరోపా నేతలతో చర్చలు...

అమెరికా కొత్త అధ్యక్షుడిపై ఉత్కంఠ..

అమెరికా కొత్త అధ్యక్షుడిపై ఉత్కంఠ..


అమెరికాలో ముందస్తు పోలింగ్ నవంబర్‌ 3 కంటే ముందే పూర్తయింది. నవంబర్‌ 3న అసలు పోలింగ్ కూడా ముగిసింది. రెండు రోజుల వ్యవధిలో ఫలితాలపైనా క్లారిటీ వచ్చేసింది. మ్యాజిక్‌ మార్కు అయిన 270ను దాటి 279 ఓట్లు సాధించిన బైడెన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమే అనుకుంటున్న తరుణంలో ట్రంప్‌ ఆయనకు మోకాలడ్డారు. దీంతో అధికార మార్పిడి సాఫీగా జరగబోవడం లేదని తేలిపోయింది. ఇప్పుడు బైడెన్‌ గెలుపును సవాల్ చేస్తూ న్యాయపోరాటానికి ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలతో అధికారులు కూడా డైలమాలో పడ్డారు. అయితే నిర్ణీత కాల వ్యవధిలోగా ఏదో ఒకటి తేలాల్సిన పరిస్ధితుల్లో కొత్త అధ్యక్షుడు ఎవరనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

 బైడెన్‌ను అడ్డుకునే ట్రంప్ వ్యూహాలు..

బైడెన్‌ను అడ్డుకునే ట్రంప్ వ్యూహాలు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన డెమోక్రాట్‌ అభ్యర్ధి జో బెడెన్‌ను అడ్డుకునేందుకు ట్రంప్‌ సిద్ధమవుతున్నారు. బైడెన్‌ గెలుపును జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్‌ కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో పోలింగ్‌ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. ఇదే ఆరోపణతో న్యాయపోరాటానికి ట్రంప్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయనతో పాటు స్వింగ్‌ రాష్ట్రాల్లో గెలిచిన రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధులు కూడా బైడెన్‌ గెలుపును అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. దీంతో వీరంతా కలిసి కోర్టుల ద్వారా బైడెన్‌ను అధ్యక్షుడు కాకుండా అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో కూడా ట్రంప్‌ రెండోసారి ఆధికారం చేపట్టేందుకు వీలుగా అధికార మార్పిడి సాఫీగా జరగాల్సి ఉందన్నారు. అదే సమయంలో పోలింగ్‌ అక్రమాలపై దృష్టిసారించాలని అటార్నీ జనరల్‌ విలియం బార్‌ న్యాయశాఖను కోరారు.

ట్రంప్‌ షాకింగ్‌ వ్యూహమిదేనా ?

ట్రంప్‌ షాకింగ్‌ వ్యూహమిదేనా ?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుతం బైడెన్‌కు 279, ట్రంప్‌కు 214 ఓట్లు వచ్చాయి. అయితే అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఇంకా ముగియలేదు. జనవరి 6న జరిగే అధ్యక్ష ఎన్నిక ప్రకటనకు ముందు ఇందుకోసం సుదీర్ఘ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఇది రాష్ట్రాల చట్టసభలతో ముడిపడి ఉంటుంది. కీలకమైన స్వింగ్‌ రాష్ట్రాల్లో ఫలితాలను ధృవీకరించాల్సి ఉంటుంది. వీటిని తన పార్టీకి చెందిన చట్ట సభల ప్రతినిధుల సాయంతో అడ్డుకోవడం ద్వారా బైడెన్‌కు అధికారాన్ని దూరం చేయాలనేది ట్రంప్‌ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే మూడు స్వింగ్‌ రాష్ట్రాలు పెన్సిల్వేనియా, అరిజోనా, మిచిగాన్‌లో ఫలితాలను ధృవీకరించకుండా చట్టసభలను అడ్డుకోవాలని ట్రంప్‌ కోర్టులను ఆశ్రయించారు. అయితే కోర్టులు చట్టసభల నిర్ణయాలను అడ్డుకోలవా అంటే అవునని చెప్పలేని పరిస్దితి.

 డిసెంబర్‌ 8 డెడ్‌లైన్‌..

డిసెంబర్‌ 8 డెడ్‌లైన్‌..

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ధృవీకరించేందుకు స్వింగ్‌ రాష్ట్రాలకు వేటికవే ప్రత్యేక కాల పరిమితి ఉంది. దీని ప్రకారం ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయి. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తమైతే మాత్రం డిసెంబర్‌ రెండో బుధవారం తర్వాత వచ్చే మొదటి సోమవారం రోజు ఎలక్ట్రోరల్‌ కాలేజ్‌ సమావేశానికి ఆరు రోజుల ముందే వీటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన డిసెంబర్ 8వ తేదీలోపు రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలి. వీరు తీసుకునే అంతిమ నిర్ణయాన్ని డిసెంబర్ 14న ఎలక్టోరల్‌ కాలేజ్‌ సమావేశంలో ధృవీకరిస్తారు. దీని ఆధారంగానే వచ్చే జనవరి 6న కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారు.

ఫైనల్‌గా ఏం జరగబోతోంది ?

ఫైనల్‌గా ఏం జరగబోతోంది ?

బైడెన్‌ గెలుపుకు సంబంధించి ఆరోపణలు చేస్తున్న ట్రంప్‌ అందుకు తగిన ఆధారాలను మాత్రం ఇప్పటివరకూ సమర్పించలేకపోయారు. దీంతో ఎలక్టోరల్‌ కాలేజ్‌ సమావేశం తర్వాత బైడెన్‌ను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే పెన్సిల్వేనియా, మిచిగాన్ మరియు అరిజోనా అనే మూడు రాష్ట్రాల్లోని వివాదాలు డిసెంబర్ 8 నాటికి పరిష్కారం కాకపోతే ఏం జరగబోతోందన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అలాంటి పరిస్ధితుల్లో ఇప్పటికే రిపబ్లికన్ల ఆధిపత్యంలో ఉన్న ఈ మూడు రాష్ట్రాల చట్ట సభలు పోలింగ్ అక్రమాల వివాదాలు పరిష్కారం కాకపోతే మాత్రం రిపబ్లికన్‌ అభ్యర్ధులనే ట్రంప్‌కు మద్దతుగా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు తిరిగి డిసెంబర్‌ 14న ఎలక్టోరల్‌ కాలేజ్‌ సమావేశంలో ట్రంప్‌కే మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. దీంతో ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడయ్యే అవకాశాలుంటాయి.


అయితే ఈ మూడు రాష్ట్రాల్లో పెన్సిల్వేనియా, మిచిగాన్‌కు ఉన్న డెమోక్రాట్‌ గవర్నర్లు మరో జాబితాను ఎలక్టోరల్‌ కాలేజ్‌కు పంపవచ్చు. అప్పుడు రిపబ్లికన్లు పంపిన జాబితా, ఈ జాబితా రెండూ కాంగ్రెస్‌కు చేరతాయి. అప్పుడు ఎలక్టోరల్‌ కాలేజ్‌కు సైతం సందిగ్దత తప్పదు.
అప్పుడు కాంగ్రెస్‌లోని రెండు సభలూ ఈ రెండు జాబితాలపై తమ అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్‌లోని సెనేట్‌లో రిపబ్లికన్లు, ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల ఆధిపత్యం ఉంది. దీంతో మరోసారి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. అప్పుడు కాంగ్రెస్‌ కూడా కొత్త అధ్యక్షుడిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడం ఖాయం. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియపై న్యాయపోరాటం ఆలస్యమైతే ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న మైక్‌ పెన్స్‌కు తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. సుప్రీంకోర్టు డెమోక్రాట్లకు అనుకూలంగా తీర్పు ఇస్తే బైడెన్, రిపబ్లికన్లకు అనుకూలంగా తీర్పు ఇస్తే ట్రంప్‌ అధ్యక్షులవుతారు. కానీ ఎవరికీ అనుకూలంగా ఇవ్వకుండా ముడు వివాదాస్పద రాష్ట్రాల ఓట్లను పక్కనబెట్టే అవకాశముంది. అప్పుడు ఎవరికీ మెజారిటీ రాదు. అలాంటి సమయంలో అత్యవసర ఎన్నిక నిర్వహించి కాంగ్రెస్‌ రెండు సభలూ కలిసి అమెరికా అధ్యక్షుడిని, సెనేట్‌ ఉపాధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశాలున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ జనవరి 20లోగా పూర్తి కాకుంటే ప్రతినిధుల సభ స్పీకర్‌గా ఉన్న డెమోక్రాట్‌ నాన్సీ పావెల్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

English summary
us president trump has not conceded defeat to his democratic rival joe biden in the november 3 presidential election. trump has alleged voter fraud and mounted legal challenges in several swing states. and he’s not alone. most elected republican party officials are yet to acknowledge that biden has won the election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X