ట్రంప్ మరో కొత్త నిబంధన.. బయటకు వెళ్తే అవన్నీ తీసుకెళ్ళాల్సిందే, లేదంటే జరిమానా, జైలుశిక్ష!

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆ దేశంలో చదువుకుంటున్న విద్యార్థులు, విదేశీయులు రోజుకో కొత్త రకం సమస్యను ఎదుర్కొంటున్నారు. ట్రంప్ తీసుకొస్తున్న రూల్స్ అక్కడ ఉన్నవారికి చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే వలసదారులపైన కఠినమైన నిర్ణయాలను అమలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ట్రంప్ విధానాలు రోజురోజుకు దారుణంగా తయారవుతున్నాయి.

ట్రంప్ మరో సరికొత్త రూల్
ప్రస్తుతం అమెరికాలో ఉన్న గ్రీన్ కార్డు హోల్డర్ల నుండి హెచ్ వన్ బి వీసా దారులు, హెచ్ ఫోర్ వీసా దారులు, ఐ 140 వీసా దారులు, f1 వీసా దారుల వరకు ప్రతి ఒక్కరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా ట్రంప్ మరో సరికొత్త రూల్ తో అక్కడ ఉన్నవారికి చుక్కలు చూపిస్తున్నారు.

Trump new rule foreigners to carry all documents ID cards otherwise fines and imprisonments

ఎక్కడికి వెళ్ళినా ఐడీ కార్డులు వెంట పెట్టుకోవాల్సిందే
కొత్త యుఎస్ ఇమిగ్రేషన్ రూల్ ప్రకారం యూఎస్ లో నివసిస్తున్న విదేశీయులు తప్పనిసరిగా తమ వెంట ఐడి కార్డులు ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. స్టడీ వీసా, ట్రావెల్ కి సంబంధించిన డాక్యుమెంట్లు, ఒకవేళ హెచ్1బి వీసాదారులు అయితే హెచ్ వన్ బీ వీసా, గ్రీన్ కార్డు సహా వివిధ కేటగిరీల వీసాలు ఉన్నవారు ఎవరైనా సరే వారితోపాటు నిరంతరం వారి గుర్తింపు కార్డులు కూడా వెంట పెట్టుకోవాలని సూచించారు.

Take a Poll

పిల్లలకు సంబంధించి రిజిస్టర్ చేసుకోవటం తప్పనిసరి
ఎక్కడ ఎవరు ఎప్పుడు అడిగినా వాటిని చూపించేలా ఉండాలని ఆదేశించారు. ఇక అంతే కాదు వారి పిల్లలకు సంబంధించిన వివరాలతో 14 ఏళ్ల వయసు నిండిన వెంటనే వారి వేలిముద్రలు సమర్పించి రీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు నమోదు చేసుకోవాలని వెల్లడించారు.

రిజిస్టర్ చేసుకోకపోతే జరిమానా లేదా జైలు శిక్ష
ఒకవేళ అలా రిజిస్టర్ చేసుకోకపోతే జరిమానా లేదా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని, ఈ నిర్ణయానికి అమెరికా కోర్టు కూడా అనుమతిని ఇచ్చిందని పేర్కొన్నారు. అక్రమ వలసదారులపైన ఉక్కు పాదం మోపడాన్ని సీరియస్ గా తీసుకుంటున్న యుఎస్ ప్రభుత్వం ఈ క్రమంలోనే ఈ తరహా సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నట్లు గా తెలుస్తోంది.

అన్ని డాక్యుమెంట్స్ క్యారీ చెయ్యాల్సిందే
ఇక యూఎస్ లో ఉన్న విదేశీయులు ఎవరైనా సరే బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను క్యారీ చేయవలసిందే. లేదంటే జరిమానాలను, జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది జాగ్రత్త.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+