UNSC: ఐరాస భద్రతామండలిలో శాశ్వతంగా భారత్? కీలక ప్రతిపాదన..!

భారత్ ను ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం త్వరలోనే దక్కబోతోందా ?, ఇప్పటికే కాలం చెల్లిన విధానాలతో నిత్యం అభాసుపాలవుతున్న ఐరాసలో సంస్కరణలకు త్వరలోనే తెరలేవనుందా ?, ఇందులో భాగంగా భారత్ కు కీలక స్ధానం దక్కనుందా ? సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ తాజా ప్రతిపాదన చూస్తే ఈ వాదనకు బలం చేకూరుతోంది.

ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తాజాగా భద్రతా మండలికి ధైర్యవంతమైన సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పాత హక్కులను పట్టుకుని వేలాడటం భవిష్యత్ పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. 1945 నాటి నిర్మాణాలు (ఐరాస) 2026 సవాళ్లను పరిష్కరించలేవని తేల్చేశారు. ఆధునిక భౌగోళిక రాజకీయాలకు అనుగుణంగా స్థిర, తాత్కాలిక సీట్ల పెంపుకు భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఐరాసకు ప్రధాన దాతగా భారత్ ఈ సంస్కరణలను శాశ్వత సభ్యత్వం పొందడానికి సానుకూలంగా చూస్తోంది.

UN Chief s Bold UNSC Reform Call 1945 Won t Fix 2026 Game-Changer for India s Permanent Seat Bid

భారత్ దశాబ్దాలుగా ఐరాసలో సంస్కరణల కోసం పోరాడుతూనే ఉంది. ​ఐదు శాశ్వత సభ్యదేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాల నియంత్రణ 21వ శతాబ్దపు అవసరాలకు సరిపోదని వాదిస్తోంది. 2021-22లో భారత్ కు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం లభించింది. ఇప్పటికీ భారత్ శాశ్వత సభ్యత్వం విషయంలో రష్యా, అమెరికా, ఫ్రాన్స్, యూకే మద్దతు పొందుతోంది. ఇలాంటి తరుణంలో సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ వ్యాఖ్యలు ఆసియా, ఆఫ్రికా వంటి ప్రాంతాల శాశ్వత సీట్లకు మద్దతుగా నిలుస్తున్నాయి. అలాగే G4 ప్రతిపాదనలను (భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్) ముందుకు తీసుకెళ్లేలా శాశ్వత సభ్యులపై ఒత్తిడి తెస్తాయి. అయితే విభజనలు, వీటో అధికారాలు మాత్రం దీనికి సవాళ్లుగా నిలుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+