చిచ్చు పెట్టిన H1B Visa- బిగ్ వికెట్ డౌన్..!!
H1B Visa వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీలో చిచ్చు పెట్టిందీ అంశం. హెచ్ 1బీ వీసా ప్రోగ్రామ్ ను రద్దు చేయాలంటూ బిల్లును ప్రవేశపెట్టిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్ కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. జనవరి 5వ తేదీన రాజీనామా చేస్తానని వెల్లడించారు. హెచ్ 1బీ వీసా ప్రోగ్రామ్ రద్దు చేయాలంటూ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ఆమె ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి మద్దతుదారుగా ఉంటూ వచ్చారు టేలర్ గ్రీన్. ఈ మధ్యకాలంలో హెచ్1బీ వీసా ప్రోగ్రామ్ లో ట్రంప్ అనుసరిస్తోన్న విధానాలను తప్పుపడుతూ వచ్చారు. గట్టిగా వ్యతిరేకించారు. ట్రంప్ విధానాలన్నీ కూడా అమెరికన్ కంపెనీలకు విదేశీ ప్రతిభను నియమించుకోవడానికి ఉపయోగపడతున్నాయమని, దీనివల్ల ఇక్కడి నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించట్లేదని తేల్చి చెప్పారు.

H-1B వీసా కార్యక్రమాన్ని సమర్థిస్తూ ఇటీవలే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సమావేశంలో ట్రంప్ ప్రసంగించిన విషయం తెలిసిందే. కొన్ని రంగాల్లో అమెరికాలో నిపుణుల కొరత ఉందని, దీన్ని భర్తీ చేయడానికి విదేశీయులను ఆహ్వానించక తప్పదని స్పష్టం చేశారు. ఇందుకు తనను క్షమించాలనీ కోరారు. దీని తర్వాత- హెచ్ 1 బీ వీసాను రద్దు చేయాలని టేలర్ గ్రీన్.. యూఎస్ కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశపెట్టారు. విదేశాల నుండి నిపుణులను తీసుకురావాల్సిన అవసరం లేదని వాదించారు.
డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటోన్న నిర్ణయాలు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. దీనివల్ల అమెరికా ఫస్ట్ అనే కాన్సెప్ట్ మరుగునపడుతోందని చెప్పారు. ఇక్కడి నిపుణులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, విదేశీయులకు కాదని తేల్చి చెప్పారు. దేశ ప్రజలకు సహాయపడేలా వైట్ హౌస్ అజెండా ఉండాలని కోరుకుంటున్నానని, ఇదే విషయాన్ని ట్రంప్‌కు చెప్పానని టేలర్ అన్నారు.
ఇప్పుడు తాజాగా రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. జనవరి 5వ తేదీన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. H-1B కార్యక్రమాన్ని రద్దు చేసే బిల్లును ప్రవేశపెట్టిన మరుసటి రోజే ట్రంప్ ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారు. తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమెను ట్రైటర్ గా అభివర్ణించారు. తన ఉద్దేశం ఏమిటో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సమావేశంలో స్పష్టంగా తెలియజేశానని, అది ఆమెకు అర్థం కాలేదనుకుంటానని వ్యాఖ్యానించారు.
-
"ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం" -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications