ట్రంప్ ఓ జాత్యహంకారి- ఒబామాపై వ్యాఖ్యలే నిదర్శనం- నిప్పులు చెరిగిన కమలా హ్యారిస్..
అమెరికా ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. చివరి నిమిషంలో డెమోక్రాట్లకు మద్దతుగా రంగంలోకి దిగిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను లక్ష్యంగా చేసుకుని రిపబ్లికన్లు ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారు. దీనికి డెమోక్రాట్ అభ్యర్ధులు కూడా అంతే దీటుగా బదులిస్తున్నారు. దీంతో అమెరికా ఎన్నికల రణరంగం ఆసక్తికరంగా మారిపోయింది.
అమెరికా ఎన్నికల ప్రచారంలో డెమోక్రాట్ అభ్యర్ధులు జో బిడెన్, కమలా హ్యారిస్‌కు మద్దతుగా మాజీ అద్యక్షుడు బరాక్ ఒబామా రంగంలోకి దిగారు. ట్రంప్ లక్ష్యంగా ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. విధానపరంగానే ఆయన విమర్శలు సాగుతున్నాయి. అయితే వీటిని జీర్ణించుకోలేని ట్రంప్ ఆయనకు తనపై విమర్శలు చేసే చట్టబద్ధత ఎక్కడుందని కౌంటర్లు మొదలుపెట్టారు. వీటిపై స్పందించిన డెమోక్రాట్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారిస్ ట్రంప్‌ను ఓ జాత్యహంకారిగా అభివర్ణించారు. ఒబామా చట్టబద్ధతను ప్రశ్నిస్తున్న ఆయన వ్యాఖ్యలు ఇందుకో నమూనాగా ఆమె పేర్కొన్నారు.

జనం నన్ను ట్రంప్ జాత్యహంకారా అని అడుగుతున్నారు. ఇప్పుడు చెబుతున్నాను ఆయన కచ్చితంగా జాత్యహంకారే అని కమల చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. ఉద్దేశపూర్వకమే అని కమల చెప్పారు. గతంలో ట్రంప్ ప్రచారంలో మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో ఇరువైపులా మంచి వ్యకులే ఉన్నారని చెప్పారు. కానీ ఒబామా ఎంట్రీతో ఆయనపై విమర్శలకు దిగుతున్నారని కమల పేర్కొన్నారు. అమెరికా చరిత్ర, వర్తమాన పరిస్ధితులు, జాతులపై గౌరవం ఉన్న వారినే ఈసారి ఎన్నుకోవాలని ఓటర్లను కమలా హ్యారిస్ అభ్యర్ధించారు.
Recommended Video
-
హార్మూజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా డ్రోన్.. 2 వేల కోట్లు గంగార్పణం.. -
ఇరాన్ క్లోజ్.. హార్మూజ్ ఓపెన్.. చైనా హ్యాపీ: ట్రంప్ సంచలన ప్రకటన -
భారత్ కు అమెరికా బిగ్ షాక్..! రష్యా-ఇరాన్ పై కోపం మన మీద..! -
స్వయానా ట్రంప్ నోట -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
US- Iran War : మళ్లీ మొదలైన వార్..! హార్ముజ్ లో అమెరికా-గల్ఫ్ పై ఇరాన్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications