H-4 Visa: హెచ్4 వీసాదారులకు ట్రంప్ బిగ్ షాక్- హెచ్ 1బీలపై తీవ్ర ప్రభావం..!

అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులు అక్రమం, సక్రమం అన్న తేడా లేకుండా స్వదేశాలకు తిప్పి పంపేందుకు దారులు వెతుకుతున్న డొనాల్డ్ ట్రంప్ .. ఇందులో కోర్టుల్నీ లెక్క చేయడం లేదు. ఇప్పటికే హెచ్1బీ వీసాలు, జన్మతః పౌరసత్వం వంటి విషయాల్లో కోర్టులు షాకులిస్తున్నా ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇదే క్రమంలో హెచ్ 1బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు ఇచ్చే హెచ్ 4 వర్క్ పర్మిట్ వీసాలను (H-4 Visa) పూర్తిగా తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. అదే జరిగితే భారతీయ హెచ్1బీ వీసాదారులపై తీవ్ర ప్రభావం పడబోతోంది.

అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉపాధి కోసం ఇస్తున్న అనుమతుల్ని రద్దు చేయడానికి ఒక కొత్త నిబంధనను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దశాబ్దానికి పైగా అర్హులైన హెచ్-4 జీవిత భాగస్వాములు దేశంలో చట్టబద్ధంగా పనిచేయడానికి అనుమతిస్తున్న విధానాన్ని ఇది ముగించబోతోంది. ఇప్పటికే హెచ్1బీ వీసాలు కలిగిన ఉన్న వారి కుటుంబ సభ్యులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికాలో హెచ్-1బీ తాత్కాలిక పని వీసాలపై ఉద్యోగం చేస్తున్న భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములకు హెచ్-4 వీసా అత్యంత కీలకమైనది. 2014 నుండి 2017 వరకు ఉన్న హెచ్-4 ఈఏడీ దరఖాస్తుల గణాంకాల ప్రకారం, వాటిలో 93 శాతం భారతీయులే ఉన్నారు. అందులోనూ 94 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు వారి వర్క్ పర్మిట్లు రద్దు చేయనున్నారు.

US Plans to Scrap H-4 Spouse Work Permits After Decade Indian H-1B Families in Focus

కొత్తగా హెచ్1బీ వీసాలు ఇచ్చే వారిపై $103,265 కొత్త రుసుమును విధించాలని, ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త స్పాన్సర్‌షిప్ వెతుక్కోవడానికి హెచ్-1బీ వీసాపై ఉన్న నిపుణులకు ఇచ్చే 60 రోజుల గడువును తొలగించాలనే ప్రతిపాదనలకు వైట్ హౌస్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు హెచ్4 వీసాల రద్దు ప్రతిపాదన అధికారిక ఆమోదానికి ఇంకా సమయం ఉంది. అయితే ఒకవేళ ప్రభుత్వం ఈ నిబంధనతో ముందుకు వెళితే, అర్హత కలిగిన హెచ్-4 జీవిత భాగస్వాములు ప్రస్తుత హెచ్-4 ఈఏడీ కార్యక్రమం కింద ఉపాధి అనుమతిని పొందే లేదా కొనసాగించే సామర్థ్యాన్ని కోల్పోతారు. అయితే ఈ ప్రతిపాదన ఇంకా తుది నియమం కాదు, ఇది హెచ్-4 పని అనుమతిని రద్దు చేయదు. దీన్ని అమల్లోకి తేవాలంటే ఫెడరల్ రిజిస్టర్ తో ప్రచురణతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటాయి. ఆ తర్వాతే తుది నిబంధనల్ని జారీ చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+