భారత్, పాక్, మధ్య.. అణుయుద్ధం జరుగుతుందా? పశ్చిమ దేశాల్లో టెన్షన్!?
ఇండియా, పాకిస్తాన్, చైనా నడు అణుయుద్ధం వచ్చే అవకాశాలున్నాయా? ఈ మూడు దేశాల మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై పశ్చిమ దేశాల్లో కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది.
వాషింగ్టన్: ఇండియా, పాకిస్తాన్, చైనా నడు అణుయుద్ధం వచ్చే అవకాశాలున్నాయా? ఈ మూడు దేశాల మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై పశ్చిమ దేశాల్లో కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది.
త్వరలోనే దక్షిణ ఆసియా దేశాల్లో ఆకాశం ఊడిపడే ప్రమాదం ఉందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. కానీ వాషింగ్టన్‌కు చెందిన అట్లాంటిక్ కౌన్సిల్ సంస్థ మాత్రం దీనికి సంబంధించి ఓ క్లారిటీ ఇచ్చింది.

ఇండియా, పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరిగే ఛాన్సే లేదని ఆ సంస్థ తేల్చేసింది. అట్లాంటిక్ కౌన్సిల్‌లోని దక్షిణాసియా నిపుణులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీ, ఇస్లామబాద్, బీజింగ్‌లో జరిగిన సెమినార్‌ల ఆధారంగా కౌన్సిల్ ఈ నిర్ణయానికి వచ్చింది.
భారత్, పాక్, చైనా మధ్య తీవ్ర శత్రుత్వం ఉన్నా.. ఆ దేశాల మధ్య వాణిజ్యం బాగానే ఉందని అట్లాంటిక్ కౌన్సిల్ తెలిపింది. భారత ఉప ఖండంలో అణు యుద్ధం రావచ్చు అని వస్తున్న వాదనలకు ఆధారాలు లేవని ఆ సంస్థ వెల్లడించింది.
అయితే చైనా, భారత్‌లో జాతీయవాదం దూకుడుగా ఉందని, చైనా, పాకిస్తాన్, ఇండియా.. ఈ మూడు దేశాల్లోనూ అణ్వాయుధ నిర్ణయం మిలిటరీ చేతుల్లో లేదని, ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి, అణుయుద్ధం వస్తుందేమో అనే భయం అవసరం లేదని పేర్కొంది.
భారత్, పాక్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పటికీ.. ఆ దేశాలేమీ అణు పరీక్షలు నిర్వహించడం లేదని అట్లాంటిక్ కౌన్సిల్ అభిప్రాయపడింది. చైనా కూడా తన వార్‌హెడ్స్‌ను ఉపయోగించడం లేదని పేర్కొంది.
-
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్‌తో గ్లోబల్ స్టార్‌గా..! -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..!










Click it and Unblock the Notifications